News September 23, 2024
ఉమ్మడి అనంతపురం జిల్లాకు వర్ష సూచన

ఉమ్మడి అనంతపురం జిల్లాకు రానున్న రెండు రోజులూ వర్షసూచన ఉన్నట్లు రేకులకుంట వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ విజయశంకరబాబు ఓ ప్రకటనలో తెలిపారు. సోమవారం, మంగళవారం ఉమ్మడి జిల్లాలో అక్కడక్కడా మోస్తరుగా వర్షం పడే అవకాశం ఉందని అన్నారు. కొన్ని ప్రాంతాల్లో 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వివరించారు. రైతులు, పశు, గొర్రెల కాపరులు పలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
Similar News
News October 19, 2025
పిల్లల పట్ల తల్లిదండ్రులు జాగ్రత్త వహించండి: ఎస్పీ

అనంతపురం జిల్లా ప్రజలకు, జిల్లా పోలీసు సిబ్బందికి ఎస్పీ జగదీశ్ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ దీపావళి మీ జీవితాలలో చీకట్లను పారదోలి మరిన్ని కాంతులు నింపాలని ఆకాంక్షించారు. చెడుపై మంచి సాధించిన విజయానికి సంకేతంగా జరుపుకునే ఈ దీపావళి పర్వదినాన ఆనవాయితీగా వచ్చే బాణసంచాను సరైన జాగ్రత్తలతో కాల్చాలని సూచించారు. పిల్లల పట్ల తల్లిదండ్రులు మరింత అప్రమత్తంగా ఉండాలని కోరారు.
News October 19, 2025
రేపు ప్రజా సమస్యల పరిష్కార వేదిక రద్దు: కలెక్టర్

అనంతపురం కలెక్టరేట్లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికను రద్దు చేసినట్లు కలెక్టర్ ఆనంద్ ఆదివారం ప్రకటించారు. సోమవారం దీపావళి సందర్భంగా ప్రభుత్వ సెలవు ఉన్నందున ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించడం లేదని తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని విజ్ఞప్తి చేశారు.
News October 19, 2025
నేడు అనంతపురంలో సందడి చేయనున్న సినీ నటి మీనాక్షి

సంక్రాంతికి వస్తున్నాం సినీ నటి మీనాక్షి చౌదరి ఆదివారం జిల్లాకు రానున్నారు. అనంతపురంలోని రాజీవ్ కాలనీలో ఓ షోరూం ప్రారంభోత్సవానికి ఆమె ముఖ్య అతిథిగా వస్తున్నట్లు నిర్వహకులు తెలిపారు. ఉదయం 11 గంటలకు ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. మంత్రి పయ్యావుల కేశవ్, ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ ఈ కార్యక్రమంలో పాల్గొంటారన్నారు.