News April 15, 2025

ఉమ్మడి అనంతపురం జిల్లాలో 201 పోస్టులు.!

image

రాష్ట్రంలోని 2,260 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులను ప్రభుత్వం సృష్టించింది. ఇందులో భాగంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో 201 పోస్టులు. వీటిలో 101 ఎస్‌జీటీ, 100 స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగాలు ఉన్నాయి. ఉమ్మడి అనంతపురం జిల్లాలో 178 స్కూల్ అసిస్టెంట్ టీచర్లు అవసరం కాగా గతంలోనే 78 పోస్టులు మంజూరు చేసింది. తాజాగా 100 పోస్టులను కేటాయిస్తూ డీఎస్సీ ద్వారా వీటిని భర్తీ చేస్తామని ప్రకటించింది.

Similar News

News April 20, 2025

DSC: కర్నూలు జిల్లాలో పోస్టులు ఇలా..

image

కర్నూలు జిల్లాలో 2,645 టీచర్ పోస్టులను <<16155948>>భర్తీ<<>> చేయనున్నారు. సబ్జెక్టుల వారీగా ఖాళీలు ఇలా..
➤ స్కూలు అసిస్టెంట్ లాంగ్వేజ్: 82
➤ హిందీ:114 ➤ ఇంగ్లీష్: 81
➤ గణితం: 90 ➤ఫిజిక్స్: 66
➤ జీవశాస్త్రం: 74 ➤ సోషల్: 112
➤ పీఈటీ: 209 ➤ఎస్జీటీ: 1,817 ఉన్నాయి.
NOTE: ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ పాఠశాలల్లో ఇంగ్లీష్ 7, మ్యాథ్స్ 4, ఫిజిక్స్ 4, జీవశాస్త్రం 4, సోషల్ 2, పీఈటీ 2, ఎస్జీటీ 10 పోస్టులు భర్తీ కాబోతున్నాయి.

News April 20, 2025

మరణంపై విజయం.. ఈస్టర్ శుభాకాంక్షలు

image

శిలువపై ప్రాణాలు విడిచిన ఏసు.. ఈస్టర్ రోజు తిరిగి ప్రాణం పోసుకుని ప్రజల మధ్యకు వచ్చారు. మరణంపై ఏసు సాధించిన విజయానికి గుర్తుగా ఈస్టర్‌ను పండుగగా జరుపుకుంటారు. క్రైస్తవులు పాటించే లెంట్ సీజన్ కూడా ఈ రోజుతో ముగుస్తుంది. మరణం అనేది జీవితానికి అంతం కాదని.. ఏసు తన జీవితం ద్వారా సందేశమిచ్చారు. ఈస్టర్‌ను కొత్త జీవితం, ఆశ, విశ్వాసానికి చిహ్నంగా భావిస్తారు.

News April 20, 2025

సిద్దిపేట: తల్లిదండ్రులు మందలించారని యువతి ఆత్మహత్య

image

తల్లిదండ్రులు మందలించారని యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన రాయపోలు మండలంలో జరిగింది. ఎస్ఐ రఘుపతి వివరాల ప్రకారం.. మండలంలోని మంతూరుకు చెందిన ప్రిస్కిల్లా(25) మూడేళ్ల నుంచి మానసిక స్థితి బాగోలేదు. ఈ క్రమంలో మాత్రలు వేసుకోమంటే నిరాకరించడంతో తల్లిదండ్రులు మందలించారు. దీంతో మనస్తాపానికి గురై 17న పురుగు మందు తాగింది. చికిత్స పొందుతూ మృతి చెందింది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

error: Content is protected !!