News March 28, 2025
ఉమ్మడి అనంత జిల్లాలో ఐదుగురికి నామినేటెడ్ పదవులు

ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఐదుగురికి కూటమి ప్రభుత్వం నామినేటెడ్ పదవులను కేటాయించింది. హిందూపురం మార్కెట్ యార్డ్ కమిటీ ఛైర్మన్గా అశ్వర్థ నారాయణరెడ్డి, కళ్యాణదుర్గం మార్కెట్ యార్డు ఛైర్ పర్సన్గా లక్ష్మీదేవి, మడకశిర మార్కెట్ యార్డు ఛైర్మన్గా గురుమూర్తి, గుంతకల్లు మార్కెట్ యార్డు ఛైర్ పర్సన్గా లక్ష్మీదేవికి అవకాశం లభించింది. ధర్మవరం మార్కెట్ యార్డు ఛైర్మన్గా నాగరత్నమ్మ (బీజేపీ)ను నియమించారు.
Similar News
News September 18, 2025
NLG: ఇంటర్ ఫలితాలు తిరోగమనం…!

ఇంటర్మీడియట్ ఫలితాల్లో నల్గొండ జిల్లా తిరోగమనం వైపుగా పయనిస్తోంది. మూడేళ్లుగా జిల్లాలో ఫలితాలు తగ్గుముఖం పడుతున్నాయి. గతేడాది జిల్లా రాష్ట్రంలో 6వ స్థానంలో నిలువగా.. ఈ సారి మాత్రం ప్రథమ సంవత్సర ఫలితాల్లో రాష్ట్రంలో 13వ స్థానం, ద్వితీయ సంవత్సరంలో 12వ స్థానానికి పడిపోయింది. మెరుగైన ఫలితాలు సాధించేందుకు యంత్రాంగం దృష్టి సారించాలని పేరెంట్స్ కోరుతున్నారు.
News September 18, 2025
ఖమ్మం: ‘పదవి ముగిసిన.. బాధ్యతలకు ముగింపు లేదు’

సర్పంచ్ పదవి కాలం ముగిసి 20 నెలలు కావొస్తున్న.. రఘునాథపాలెం మండలంలోని బూడిదంపాడు గ్రామ మాజీ సర్పంచ్ షేక్ మీరా సాహెబ్ మాత్రం తన వంతు బాధ్యతలు నిర్వర్తిస్తూనే ఉన్నారు. అనునిత్యం ప్రజల మధ్యలోనే ఉంటూ అనేక పనులు చేయిస్తూ తన వంతు కృషి చేస్తున్నారు. వీధులను శుభ్రం చేయించడం, బ్లీచింగ్ చల్లించడం, పరిసర ప్రాంతాల్లో పిచ్చి మొక్కల నివారణకు కలుపు మందు పిచికారి చేయించడం వంటి ఎన్నో పనులు చేపిస్తూ ఉన్నారు.
News September 18, 2025
MNCL: యూరియా కోసం వెళుతూ.. మహిళా రైతు మృతి

యూరియా తెచ్చుకుందామని వెళ్తుండగా రోడ్డు ప్రమాదంలో గోపాల్రావుపేటకు చెందిన నానక్క (40) మృతిచెందింది. తాండూర్ ఎస్సై కిరణ్ కుమార్ వివరాల ప్రకారం..గోపాల్ రావుపేటకు చెందిన నానక్క(40) కుమారుడిని స్కూల్ బస్సు ఎక్కించి తెలిసిన వారితో యూరియా కోసం బైక్పై రేచినికి బయలుదేరింది. ఈక్రమంలో స్కూల్ బస్సు బైక్ను ఢీ కొట్టగా ఇద్దిరికి గాయాలయ్యాయి. నానక్కను కరీంనగర్ తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందింది.