News September 28, 2024

ఉమ్మడి అనంత జిల్లాలో రానున్న 5 రోజుల్లో తేలికపాటి వర్షాలు

image

ఉమ్మడి అనంతపురం జిల్లాకు రానున్న 5 రోజుల్లో తేలికపాటి వర్షసూచన ఉన్నట్లు రేకులకుంట వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ విజయ శంకరబాబు ఓ ప్రకటనలో తెలిపారు. రైతులు, పశు, గొర్రెల కాపరులు పలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రానున్న ఐదు రోజుల్లో పగటి ఉష్ణోగ్రతలు 37.0 డిగ్రీలు రాత్రి ఉష్ణోగ్రతలు 26.0 డిగ్రీలుగా నమోదయ్యే అవకాశం ఉందన్నారు.

Similar News

News October 9, 2024

ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించండి: బీజేపీ విష్ణువర్ధన్ రెడ్డి

image

మాజీ సీఎం జగన్ X వేదికగా చేసిన వ్యాఖ్యలపై ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి స్పందించారు. ‘2011లో ప్రారంభమైన YCP నుంచి ఇప్పటివరకు 35 మంది MPలు, 232 మంది MLAలు గెలిచారు. ఇప్పుడు మీరు నిందిస్తున్న EVMల వల్లే గెలిచి మీరు CM అయ్యారు. మీ పాలనలో చేసిన తప్పులను దాచడానికి ప్రయత్నించడం మానేయండి. ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించి, వాస్తవాలను గ్రహించి, ఆరోపణలు మానుకోండి’ అని పేర్కొన్నారు.

News October 9, 2024

డీసీఆర్సీ విభాగం సిబ్బందితో సమీక్ష నిర్వహించిన ఎస్పీ

image

శ్రీ సత్యసాయి జిల్లాలోని ఎస్పీ కార్యాలయంలో డీసీఆర్సీ విభాగం సిబ్బందితో జిల్లా ఎస్పీ రత్న సమీక్ష నిర్వహించారు. ఎస్పీ కార్యాలయంలో డిసిఆర్బి శాఖ ఎంతో కీలకమైనదని అన్ని కేసులపై అవగాహన పెంచుకొని పనిచేయాలని ఎస్పీ సూచించారు. క్రైమ్ కేసులతోపాటు ఎస్సీ ఎస్టీ, లోకాయుక్త, రౌడీషీటర్స్, చోరీలు, బోర్డర్ పోలీస్ స్టేషన్, క్రిమినల్స్, ఫ్యాక్షన్ గ్రామాలపై ఎస్పీ సమీక్ష నిర్వహించారు.

News October 9, 2024

ఎస్‌కే యూనివర్సిటీ పరీక్ష ఫలితాల విడుదల

image

అనంతపురంలోని శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీలో సెకండ్ సెమిస్టర్ UG రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ప్రొఫెసర్ శోభలత కమిటీ సభ్యులు ఎస్కే ఛాంబర్‌లో ఫలితాలను విడుదల చేశారు. ఫలితాలను జ్ఞానభూమి పోర్టల్‌లో అందుబాటులో ఉంచామన్నారు. కార్యక్రమంలో రెక్టార్ ప్రొఫెసర్ వెంకటనాయుడు, రిజిస్టార్ రమేశ్ బాబు, పరీక్షల నియంత్రణ అధికారి లోకేశ్వర్, అసిస్టెంట్ రిజిస్టర్ శంకర్ పాల్గొన్నారు.