News August 5, 2024
ఉమ్మడి ఆదిలాబాద్‌లోని నేటి TOP NEWS

★ఆదిలాబాద్: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
★కాగజ్‌నగర్: మట్కా ఆడుతూ పట్టుబడిన యువకుడు
★ముధోల్: ట్రాక్టర్ బోల్తా.. డ్రైవర్ మృతి
★రామకృష్ణాపూర్: ఆరుగురు పేకాటరాయుళ్లు అరెస్ట్
★నస్పూర్: పేకాట ఆడుతున్న ముగ్గురు పట్టివేత
★నేరడిగొండ: లారీ ఢీకొని వృద్ధురాలి మృతి
★నిర్మల్: వైన్ షాపులో చోరీ
★మంచిర్యాల:షార్ట్ సర్క్యూట్‌తో కారులో మంటలు
★మంచిర్యాల: పేకాట స్థావరంపై దాడి.. ఆరుగురు అరెస్ట్
Similar News
News December 11, 2025
నార్నూర్: డబ్బులు పంచుతూ దొరికిన అభ్యర్థి భర్త

సర్పంచ్ అభ్యర్థి భర్తపై కేసు నమోదు చేసిన ఘటన నార్నూర్‌లో చోటుచేసుకుంది. ఎఫ్ఎస్‌టీ టీమ్ ఇన్‌ఛార్జ్ సొరాజి వివరాల ప్రకారం.. ఈనెల 10న మండల కేంద్రంలోని ముస్లిం వాడలో ఓ వ్యక్తి ఇంటింటికీ తిరుగుతూ ఓటర్లకు డబ్బులు పంచుతున్నాడనే సమాచారంతో ఆకస్మికంగా తనిఖీ చేశారు. విజయనగర్ కాలనీకి చెందిన సర్పంచ్ అభ్యర్థి భర్త ఆడే సురేశ్ వద్ద నుంచి రూ.10వేలు స్వాధీనం చేసి కేసు నమోదు చేశామని వెల్లడించారు.
News December 11, 2025
ఆదిలాబాద్ జిల్లాలో 40.37% పోలింగ్ నమోదు

ఆదిలాబాద్ జిల్లాలో తొలి విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఉదయం 11 గంటల వరకు 40.37 శాతం పోలింగ్ నమోదైందని జిల్లా పంచాయతీ అధికారి రమేశ్ తెలిపారు. మండలాల వారీగా పోలింగ్ శాతం వివరాలు ఇలా ఉన్నాయి. ఇచ్చోడలో 35.61%, సిరికొండ 60.21%, ఇంద్రవెల్లి 33.14%, ఉట్నూర్ 38.59%, నార్నూర్ 45.11%, గాదిగూడలో 53.77% నమోదైంది. ఓటర్లు చురుగ్గా పాల్గొంటున్నారు.
News December 11, 2025
నిబంధనలు పాటించకుంటే కేసు నమోదు: ఎస్పీ కాజల్ సింగ్

ఆదిలాబాద్ జిల్లాలో ఆరు మండలాల్లో జరుగుతున్న మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థులు విజయోత్సవ ర్యాలీలో నిర్వహించరాదని అదనపు ఎస్పీ కాజల్ సింగ్ తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా ర్యాలీలను నిర్వహించిన వారిపై కేసులను నమోదు చేయబడతాయని హెచ్చరించారు. సంబరాల పేరుతో టపాసులు కాల్చవద్దన్నారు. 936 మంది సిబ్బందితో పోలీస్ యంత్రాంగం ప్రతిష్ఠమైన బందోబస్తు చర్యలను చేపట్టిందని తెలిపారు.


