News August 7, 2024
ఉమ్మడి ఆదిలాబాద్లోని నేటి CRIME REPORT

★ దహేగం: 14క్వింటాళ్ల PDS బియ్యం పట్టివేత
★మంచిర్యాల: ఆటో దొంగల అరెస్ట్
★ ఆదిలాబాద్: అనారోగ్యంతో జూనియర్ అసిస్టెంట్ మృతి
★ కాగజ్ నగర్: ప్రమాదవశాత్తు కూలిన ఇంటిషెడ్డు
★ కెరమెరి: అక్రమంగా ఇసుక తరలిస్తున్న లారీ పట్టివేత
★ తిర్యాని: గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యం
★ బెల్లంపల్లి: విద్యార్థుల మధ్య గొడవ.. ఒకరికి గాయాలు
★ కుబీర్: బావిలో దూకి వ్యక్తి ఆత్మహత్య
★ నెన్నెల: మామిడి చెట్ల నరికివేతపై ఫిర్యాదు
Similar News
News November 21, 2025
ADB: రైతులందరికీ జోగురామన్న కృతజ్ఞతలు

ఆదిలాబాద్ జిల్లా రైతులందరికీ మాజీ మంత్రి జోగు రామన్న కృతజ్ఞతలు తెలిపారు. ఆఖిలపక్ష రైతు ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేసిన నాయకులకు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలియచేస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఇదే స్ఫూర్తితో పార్టీని మరింత బలోపేతం చేస్తూ రైతులందరికీ న్యాయం జరిగేంత వరకు బీఆర్ఎస్ పార్టీ పక్షాన పోరాడటానికి అందరూ సిద్ధంగా ఉండాలని సూచించారు.
News November 21, 2025
BREAKING: ఆదిలాబాద్ ఏఎస్పీగా మౌనిక

రాష్ట్రంలో 32 మంది IPSలను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆదిలాబాద్ ఏఎస్పీగా మౌనిక, ఉట్నూర్ ఏఎస్పీగా కాజల్ సింగ్ నియమితులయ్యారు. కాజల్ సింగ్ ఇదివరకు ఉట్నూర్ ఎస్డీపీవోగా, మౌనిక ఇదివరకు దేవరకొండ ఏఎస్పీగా బాధ్యతలు నిర్వహించారు. ఈ మేరకు వీరు త్వరలోనే బాధ్యతలు చేపట్టనున్నారు.
News November 21, 2025
ADB: డిసెంబర్లో TCA రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీలు

తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీలు డిసెంబర్ మొదటి వారంలో నిర్వహించనున్నట్లు TCA రాష్ట్ర సభ్యురాలు, జడ్పీ మాజీ ఛైర్పర్సన్ చిట్యాల సుహాసిని తెలిపారు. ఈ పోటీలు జిల్లా, జోనల్ స్థాయిలో తరువాత రాష్ట్ర స్థాయిలో ఉంటాయని వివరించారు. అండర్ 23తో పాటు 23ఏళ్ల వారికి నలుగురు క్రీడాకారులకు అవకాశం ఉంటుందని వెల్లడించారు. ఆమెతో పాటు జోనల్ ఇన్ఛార్జ్ నరోత్తమ్ రెడ్డి ఉన్నారు.


