News March 23, 2024

ఉమ్మడి ఆదిలాబాద్‌లో కారు ఖాళీ..!

image

పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో BRS ప్రజాప్రతినిధులు, నాయకులు ఒక్కొక్కరు ‘కారు’ దిగుతుండటంతో ఆ ప్రభావం ఉమ్మడి ఆదిలాబాద్ వ్యాప్తంగా కొనసాగేలా కనిపిస్తోంది. మాజీ ఎమ్మెల్యేలు, ప్రధాన నాయకులు, ఆదిలాబాద్ జడ్పీ, డీసీసీబీ ఛైర్మన్‌లు ఇటీవల కారు దిగారు. ఇక నేడో రేపో మాజీ మంత్రి ఐకె రెడ్డి సైతం కాంగ్రెస్ లో చేరనున్నారు. దింతో ఉమ్మడి జిల్లాలో దాదాపు కారు ఖాళీ అవుతున్నట్లు కనిపిస్తుంది.

Similar News

News February 7, 2026

ఈ నెల 9న సా.5 గంటలకు ప్రచారం బంద్: ADB కలెక్టర్

image

మున్సిపల్ పోలింగ్‌కు 48 గంటల ముందు అంటే ఈ నెల 9న సాయంత్రం 5 గంటలకు ప్రచారం ముగియాలని కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. బహిరంగ సభలు, ఊరేగింపులు నిషేధమని, ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసే విధంగా సినిమాలు, టీవీ లేదా ఇతర మాధ్యమాల ద్వారా ప్రచారం చేయరాదన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలతో పాటు 2 సంవత్సరాల వరకు జైలు శిక్ష లేదా జరిమానా విధించే అవకాశం ఉందన్నారు.

News February 7, 2026

పోలింగ్ కేంద్రాల్లో పకడ్బందీ ఏర్పాట్లు: ADB కలెక్టర్

image

ఆదిలాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 49 వార్డుల్లోని 216 పోలింగ్ కేంద్రాలలో ఓటర్లకు, సిబ్బందికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ రాజర్షిషా అధికారులను ఆదేశించారు. పోలింగ్ ఏర్పాట్లు, మౌలిక సదుపాయాల కల్పన తదితర అంశాలపై పోలింగ్ ఇన్‌ఛార్జ్ అధికారులతో సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. పోలింగ్ సజావుగా సాగేందుకు మొత్తం 2,154 మంది సిబ్బందిని నియమించినట్లు తెలిపారు.

News February 7, 2026

మండల స్థాయిలోనే ప్రజా సమస్యల పరిష్కారం: కలెక్టర్

image

ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం‘ప్రజావాణి’ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. జిల్లా ప్రజలు ఇకపై కలెక్టరేట్‌కు రావాల్సిన అవసరం లేదన్నారు. సంబంధిత ఎంపీడీఓ కార్యాలయాల్లోని సమాచార సహాయక కేంద్రం (IFC) ద్వారా డిజిటల్ పద్ధతిలో ఫిర్యాదులను సులభంగా నమోదు చేసుకోవచ్చని పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలోనే వినతులను పరిష్కరించి ప్రజలకు సౌకర్యాలు మెరుగుపరుస్తామని ఆయన స్పష్టం చేశారు.