News February 12, 2026

ఉమ్మడి ఆదిలాబాద్‌లో టెన్షన్.. టెన్షన్

image

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని 10 మున్సిపాలిటీలలో బుధవారం సాయంత్రం పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఇప్పుడు అభ్యర్థుల్లో గెలుపు ఓటముల టెన్షన్ మొదలైంది. ఓటర్లు ఎవరికి ఓటు వేశారు?, ఎవరికి పట్టం కడతారో అని అభ్యర్థులు హైరానా పడుతున్నారు. ఎవరికివారు లెక్కలు బేరీజు వేసుకుంటూ ఎవరి ధీమాలో వారు ఉన్నారు.

Similar News

News March 14, 2026

విజయవాడ: రాష్ట్రస్థాయి ఇఫ్తార్ విందు వేదిక మార్పు

image

విజయవాడలో ఈ నెల 16న ప్రభుత్వం నిర్వహించనున్న రాష్ట్రస్థాయి ఇఫ్తార్ విందు వేదిక మారినట్లు కలెక్టర్ డా. జి. లక్ష్మీశా తెలిపారు. గతంలో నిర్ణయించిన ఏ1 కన్వెన్షన్ సెంటర్‌కు బదులుగా, ఇప్పుడు ఏ-ప్లస్ కన్వెన్షన్ సెంటర్‌లో ఈ కార్యక్రమం జరుగుతుందని స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే మత పెద్దలు, ప్రజాప్రతినిధుల కోసం అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పక్కాగా ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.

News March 14, 2026

సిరిసిల్ల: ‘మహిళలకు 33% రిజర్వేషన్ అమలు చేయాలి’

image

మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం రాష్ట్ర కార్యదర్శి మల్లు లక్ష్మి అన్నారు. సిరిసిల్లలోని నెహ్రూ నగర్‌లో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. నిరంతరం మహిళా హక్కుల కోసం పోరాడుతున్న అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘంలో మహిళలందరూ సభ్యులుగా చేరాలన్నారు. దేశంలో గంటకు ఇద్దరు మహిళపై లైంగిక దాడులు జరుగుతుందన్నారు.

News March 14, 2026

నంద్యాల: అప్పటిలా వెంటనే అందడం లేదు!

image

జిల్లాలో గ్యాస్ కష్టాలు మొదలయ్యాయి. బుక్ చేసుకున్న 5-7 రోజులకు డెలివరీ ఇస్తున్నారు. సిలిండర్ ధరతో పాటు డెలివరీ ఛార్జీ పేరుతో రూ.1,040 నుంచి రూ.1,050 వరకు తీసుకుంటున్నట్లు పలు గ్రామాల ప్రజలు చెప్తున్నారు. గతంలో బుక్ చేసుకున్న వెంటనే సిలిండర్లు వచ్చేవని, ప్రస్తుతం 5 నుంచి వారం రోజులు పడుతోందని వాపోతున్నారు. ఇదే అదనుగా కొందరు బ్లాక్‌లో విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నట్లు ప్రజలు ఆరోపిస్తున్నారు.