News August 13, 2024
ఉమ్మడి ఆదిలాబాద్లో నేటి TOP NEWS

◆ తాండూర్ గుడుంబా విక్రయిస్తున్న ఒకరిపై కేసు
◆ నిర్మల్, ఆదిలాబాద్లో బంద్ ప్రశాంతం
◆ ఉట్నూర్: పంట పొలాల్లో అడవిపందుల విధ్వంసం
◆ తాండూరు: రైలు నుంచి పడి గుర్తుతెలియని వ్యక్తి మృతి
◆ మందమర్రి: సమాధులు కూలగొట్టారని ఫిర్యాదు
◆ ఆదిలాబాద్: తోపుడుబండ్ల వివాదం
◆ లోకేశ్వరం: సొంత పరీక్షలతో రోడ్లకు మన మత్తు చేయించిన రైతు
◆ రెబ్బెన: 150 అడుగుల జాతీయ జెండాతో ర్యాలీ
◆ ఉమ్మడి జిల్లాలో హార్ ఘర్ తీరంగా ర్యాలీ
Similar News
News November 21, 2025
ADB: ‘పాఠశాల సమయాన్ని మార్పు చేయాలని కలెక్టర్కు వినతి’

ADB కలెక్టర్ రాజర్షి షాను PRTU ఉపాధ్యాయ సంఘం జిల్లా నాయకులు కలెక్టర్ కార్యాలయంలో గురువారం రాత్రి మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లాలో చలి తీవ్రత పెరగడంతో పాఠశాల సమయాన్ని మార్చాలని కోరుతూ కలెక్టర్ రాజర్షి షాతో విన్నవించగా సానుకూలంగా స్పందించినట్లు నాయకులు పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు కొమ్ము కృష్ణ కుమార్, సంఘం నాయకులు తదితరులు ఉన్నారు.
News November 21, 2025
ADB: జాతీయ రహదారిని అడ్డుకోవడం చట్టరీత్య నేరం: డీఎస్పీ

జాతీయ రహదారిపై అత్యవసర సేవల వాహనాలు ప్రయాణిస్తూ ఉంటాయని వాటిని అడ్డుకోవడం చట్ట ప్రకారం నేరంగా పరిగణించబడుతుందని ADB డిఎస్పీ జీవన్ రెడ్డి తెలిపారు. యువత కేసుల బారిన పడకుండా వారి భవిష్యత్తులను నాశనం చేసుకోకూడదని తెలిపారు. అంబులెన్స్, అగ్నిమాపక, వాహనాలు ఆస్పత్రిలకు వెళ్లేవారికి అసౌకర్యం కలిగే చర్యలు చేయవద్దన్నారు. యువత కేసుల వల్ల ఉద్యోగ అవకాశాలను కోల్పోకుండా ఉండాలని సూచించారు.
News November 19, 2025
BRS రైతులను మోసం చేసింది: ఆడే గజేందర్

రైతుల సంక్షేమం గురించి బీఆర్ఎస్ నాయకులు మాట్లాడటం విడ్డూరంగా ఉందని బోథ్ నియోజకవర్గ అసెంబ్లీ ఇన్ఛార్జ్ ఆడే గజేందర్ అన్నారు. ADB కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బుధవారం మాట్లాడారు. గతంలో రుణమాఫీ అంటూ ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందన్నారు. ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కుతుందన్నారు.


