News July 14, 2024
ఉమ్మడి ఆదిలాబాద్‌లో నేటి ముఖ్యాంశాలు
★ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొహారం ఉత్సవాలు
★ ఆదిలాబాద్‌లో హైడ్రామా
★ దస్తురాబాద్: ప్రేమ విఫలమై యువకుడి ఆత్మహత్య
★ భీమిని: నిషేధిత గడ్డి మందు పట్టివేత
★ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బోనాల సందడి
★ తాంసి: పురుగు మందు తాగి వ్యక్తి ఆత్మహత్య
★ భైంసా: దాబాల్లో పోలీసుల దాడులు.. మద్యం స్వాధీనం
★ ఉమ్మడి వ్యాప్తంగా కురిసన వర్షం
★ నిర్మల్‌లో గుర్తుతెలియని మృతదేహం లభ్యం.
Similar News
News October 12, 2024
ADB: దసరా.. మీ VILLAGE స్పెషల్ ఏంటి?
దసరా పండుగ అనగానే పల్లె యాదికొస్తుంది. ఉరుకుల పరుగుల జీవితంలో ఎక్కడెక్కడో ఉద్యోగాలు చేస్తూ ఉన్న వారు తిరిగి సొంతూరుకు రావడం, బంధువులు, దోస్తులను కలిసి ఊరంతా తిరగడం బాగుంటుంది. ‘ఎప్పుడొచ్చినవ్.. అంతా మంచిదేనా’ అంటూ తెలిసినవారి పలకరింపు ఆనందాన్ని కలిగిస్తుంది. ప్రతి ఊరిలో దసరా వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు. పలు చోట్ల విభిన్నంగానూ చేస్తారు. మరి మీ ఊరిలో దసరా వేడుకలకు ఏం చేస్తారో కామెంట్ చేయండి.
News October 12, 2024
కుంటల: ఒకే ఊరిలో ఏడుగురికి ప్రభుత్వ ఉద్యోగాలు
ఇటీవల ప్రకటించిన డీఎస్సీ ఫలితాలలో కుంటల మండలం కల్లూరు గ్రామానికి చెందిన ఏడుగురికి ప్రభుత్వ కొలువులు దక్కాయి. విశాల, సృజన, విజయలక్ష్మి, మహ్మద్, ప్రశాంత్, సంపత్, సాయికిరణ్ (SA) టీచర్లుగా నియామక పత్రాలు అందుకున్నారు. కల్లూరు ఉద్యోగుల సంఘం నేతలు వీరిని సన్మానించారు. ఒకే ఊరికి చెందిన ఏడుగురికి ఉద్యోగాలు రావడంతో సంతోషం వ్యక్తం చేశారు. MEO ముత్యం, పంచాయతి సెక్రటరీ సంధ్యారాణి, తదితరులు పాల్గొన్నారు.
News October 11, 2024
మంచిర్యాల: ఒకే గ్రామంలో నలుగురికి టీచర్ ఉద్యోగాలు
మంచిర్యాల జిల్లా తాండూరు మండలం అచ్చలాపూర్ గ్రామంలోని నలుగురు డిఎస్సిలో ఒకే ప్రయత్నంలో టీచర్ ఉద్యోగాలు సాధించారు. ఇందులో ఏకారి ఆంజనేయులు స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్సు పుప్పాల మానస, రవళి, మానస ముగ్గురు సెకండరీ గ్రేడ్ టీచర్ ఉద్యోగాలు సాధించారు. వీరి తల్లిదండ్రులు కూలీ పని చేసుకుంటూ చదవించి ఉద్యోగాలు సాధించారు. ఒకే గ్రామం నుంచి నలుగురు టీచర్ ఉద్యోగాలు పోందినందుకు గ్రామస్థులు మిత్రులు అభినందించారు.