News May 26, 2024

ఉమ్మడి ఆదిలాబాద్‌లో 45.6 డిగ్రీల ఉష్ణోగ్రత

image

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మొన్నటి వరకు చిరుజల్లులతో వాతావరణం చల్లబడగా మళ్లీ ఉష్ణోగ్రతలు పెరిగినట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలో అత్యధికంగా శనివారం నిర్మల్ జిల్లాలో 45.6 డిగ్రీలు నమోదైంది. ఆదిలాబాద్‌లో 44.7, మంచిర్యాలలో 44.6, ఆసిఫాబాద్‌లో 43.1 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఎండ తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

Similar News

News November 24, 2025

ADB: మనకే పదవి వస్తుందనుకున్నాం.. కానీ

image

డీసీసీ అధ్యక్షుల ఎంపికతో కాంగ్రెస్‌లో సీనియర్లు నిరాశకు లోనయ్యారు. తమకే పదవి వస్తుందని జిల్లాలో పార్టీని ముందుకు తీసుకెళ్దామని భావించారు. జిల్లాలో గోక గణేశ్ రెడ్డి, కంది శ్రీనివాస్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, గండ్రత్ సుజాత, ఆడే గజేందర్ వంటివారు అధ్యక్ష పీఠంపై కన్ను వేశారు. కానీ అధిష్టానం వారిని కాదని నరేశ్ జాదవ్‌కు బాధ్యతలు అప్పగించింది. దీంతో పదవి ఆశించిన నేతలు, వారి అభిమానులు నిరాశలో ఉన్నారు.

News November 23, 2025

OTP విధానంతో పంట విక్రయం: కలెక్టర్ రాజర్షి షా

image

కౌలు రైతుల కోసం ప్రభుత్వం పెద్ద ఎత్తున సదుపాయాలు కల్పిస్తోందని జిల్లా కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. కలెక్టరేట్‌లో వ్యవసాయ, ఉద్యాన, మార్కెటింగ్ శాఖలతో శనివారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడారు. కౌలు రైతులు పత్తితో పాటు సోయాబీన్, మొక్కజొన్న పంటలను కూడా OTP విధానంతో విక్రయించుకునే అవకాశం కల్పించామని తెలిపారు. రైతులు తమ సందేహాల నివృత్తికి 6300001597 నంబర్‌కు కాల్ చేయాలని సూచించారు.

News November 23, 2025

ఆదిలాబాద్ కాంగ్రెస్ కొత్త సారథి నేపథ్యమిదే

image

ADB కాంగ్రెస్ కమిటీ జిల్లా అధ్యక్షుడిగా గుడిహత్నూర్ మండలానికి చెందిన నరేశ్ జాదవ్ నియమితులైన విషయం తెలిసిందే. 2014 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి 2వ స్థానంలో నిలిచారు. AICC మెంబర్‌గా ఉన్న ఆయన గత అసెంబ్లీ ఎన్నికల్లో బోథ్ అసెంబ్లీ నుంచి బరిలో నిలవాలనుకున్నా టికెట్ ఇవ్వలేదు. అయినా పార్టీలోనే కొనసాగుతూ తనదైన ముద్ర వేసుకున్నారు. పార్టీ పట్ల ఆయనకున్న విధేయతతోనే అధ్యక్ష పదవి వచ్చింది.