News May 26, 2024

ఉమ్మడి ఆదిలాబాద్‌లో 45.6 డిగ్రీల ఉష్ణోగ్రత

image

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మొన్నటి వరకు చిరుజల్లులతో వాతావరణం చల్లబడగా మళ్లీ ఉష్ణోగ్రతలు పెరిగినట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలో అత్యధికంగా శనివారం నిర్మల్ జిల్లాలో 45.6 డిగ్రీలు నమోదైంది. ఆదిలాబాద్‌లో 44.7, మంచిర్యాలలో 44.6, ఆసిఫాబాద్‌లో 43.1 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఎండ తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

Similar News

News February 16, 2025

ADB: టీచర్లు పట్టం కట్టేది ఎవరికో.!

image

ADB, KNR, NZB, MDK టీచర్ MLC స్థానానికి ఈనెల 27న ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుత ఎమ్మెల్సీ కూర రఘోతంరెడ్డి, BJP నుంచి కొమురయ్య, TPTF నుంచి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి Y.అశోక్ కుమార్, PRTU ఉపాధ్యాయ సంఘం నుంచి వంగ మహేందర్ రెడ్డి, రిటైర్డ్ RJD L.సుహాసినితో పాటు మొత్తం 17 మంది టీచర్ ఎమ్మెల్సీ బరిలో నిలిచారు. మేధావి వర్గంగా భావించే టీచర్లు ఎవరికి పట్టం కట్టనున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.

News February 16, 2025

నా పేరు మీద నకిలీ ఫేస్‌బుక్ ఖాతాలు: నిర్మల్ కలెక్టర్

image

నిర్మల్ జిల్లా కలెక్టర్ పేరుతో ఉన్న నకిలీ ఫేస్‌బుక్ ఖాతాలను నమ్మవద్దని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ పేరుతో కొందరు నకిలీ ఫేస్బుక్ ఖాతాలను సృష్టించారని ఆమె పేర్కొన్నారు. ఆయా ఫేస్బుక్ ఖాతాలకు ఎట్టి పరిస్థితుల్లో స్పందించవద్దన్నారు. జిల్లా కలెక్టర్ పేరుతో, ఫొటోలతో ఉన్న ఫేస్ బుక్ ఖాతాలు నకిలీవని, ఇప్పటికే జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయించామన్నారు.

News February 16, 2025

ADB: బాబా మాటలు నమ్మి మోసపోయిన వ్యక్తి

image

బాబా మాటలు నమ్మి ఒక వ్యక్తి మోసపోయిన ఘటన ADBలో జరిగింది. CI కరుణాకర్ కథనం ప్రకారం.. ఖుర్షీద్ నగర్‌కు చెందిన అజహర్ ఉద్దీన్‌కు మహారాష్ట్రకు చెందిన యాసీన్(జనబ్ డోంగీబాబా) పరిచయమయ్యాడు. ఆయన అజహర్‌కు మాయమాటలు చెప్పి తన వద్ద తాయత్తు తీసుకుంటే సమస్యలన్నీ తీరిపోతాయని నమ్మించాడు. అయితే తాయత్తు తీసుకున్న అనంతరం ఇంట్లో గొడవలు ప్రారంభం కావడంతో తనను బాబా మోసం చేశాడంటూ టూటౌన్ ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు.

error: Content is protected !!