News August 28, 2024
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 242 గంజాయి కేసులు

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో యువత గంజాయికి బానిసలు అవుతున్నారు. ముఖ్యంగా మహారాష్ట్ర నుంచి గంజాయి సరఫరా అవుతున్నట్లు తెలుస్తోంది. కాగా గత మూడేళ్లలో జిల్లా వ్యాప్తంగా 242 కేసులు నమోదు కాగా, 398 మందిని అరెస్ట్ చేశారు. 1,056.64 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Similar News
News December 18, 2025
ఆదిలాబాద్: ప్రమాణ స్వీకార పత్రం ఇదే..!

ఆదిలాబాద్ జిల్లాలో పంచాయతీ ఎన్నికల మూడు విడతలు ప్రశాంతంగా పూర్తయ్యాయి. ఇటీవల పంచాయతీ రాజ్ ఈనెల 20న ప్రమాణ స్వీకారానికి ఇచ్చిన తేదీని 22న మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నూతన సర్పంచ్, వార్డు సభ్యుల ప్రమాణానికి పత్రం విడుదల చేసింది. విజయోత్సవ ర్యాలీల కోసం గెలుపొందిన వారు సిద్ధంగా ఉన్నారు.
News December 18, 2025
ఆదిలాబాద్: స్కూలు వేళల్లో మార్పు

చలి తీవ్రత నేపథ్యంలో పాఠశాలల పనివేళలను మారుస్తూ కలెక్టర్ రాజర్షి షా గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. కొత్త నిబంధనల ప్రకారం ఉదయం 9:40 గంటల- సాయంత్రం 4:30గం. వరకు పాఠశాలలు కొనసాగుతాయన్నారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు ఆదేశాలను తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఉత్తర్వులు తక్షణమే అమలులోకి వస్తాయని పేర్కొన్నారు.
News December 17, 2025
ఒక్క ఓటుతో మూత్నూర్ తండా సర్పంచ్గా జాదవ్ రాంజీ

గుడిహత్నూర్ మండలంలోని మూత్నూర్ తండా గ్రామ సర్పంచ్గా జాదవ్ రాంజీ నాయక్ విజయం సాధించారు. సమీప అభ్యర్థిపై 1 ఓటు తేడాతో గెలుపొందారు. ప్రజల సమస్యల పరిస్కారానికి తన వంతు కృషి చేస్తూ.. ప్రతి క్షణం అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు.


