News November 27, 2024

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని నేటి ముఖ్యాంశాలు

image

ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల జిల్లాలోని నేటి ముఖ్యాంశాలు ఇవే.
కాగజ్నగర్: భర్తను హత్యా చేసిన భార్య
వాంకిడి: రేపటి విద్యాసంస్థల బందుకు మద్దతు
మంచిర్యాల: పట్టుబడిన గంజాయి దహనం
కుబీర్: భార్యను హత్యా చేసిన కేసులో భర్తకు జీవిత ఖైదు
ADB: రోడ్డు ప్రమాదంలో గాయపడిన యువకుడు మృతి
ADB: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు
వాంకిడి: శైలజ మృతిపై ధర్నా, రాస్తారోకోలు

Similar News

News February 23, 2026

ఆదిలాబాద్‌: ఈ మండలాల్లో 2 రోజులు ‘భగీరథ’ నీటి సరఫరా బంద్

image

సీతగొండి వద్ద మిషన్ భగీరథ పైప్‌లైన్ మరమ్మతుల కారణంగా ఫిబ్రవరి 24, 25 తేదీల్లో ఆదిలాబాద్ మున్సిపాలిటీతో పాటు ఆదిలాబాద్ రూరల్, బేల, జైనాధ్, మావల, తంసి, భీమ్పూర్, తలమడుగు, గుడిహత్నూర్ మండలాల్లోని 406 గ్రామాలకు నీటి సరఫరా నిలిచిపోనుంది. దీనితో ప్రజలు ముందస్తుగా నీటిని నిల్వ చేసుకోవాలని అధికారులు సూచించారు.

News February 23, 2026

నార్నూర్‌లో పెళ్లికి కట్నకానుకలు నిషేధం

image

నార్నూర్ మండలంలోని ఖైర్డాట్వ గ్రామంలో ఆదివారం గ్రామస్థులు కలిసి పెళ్లికి కట్నకానుకలను నిషేధిస్తూ తీర్మానించారు. ఈ నేపథ్యంలో అదే గ్రామానికి చెందిన వధువు మడావి పూర్ణబాయి పెళ్లి కోసం 100 కుటుంబాలు కలిసి రూ.26,551 నగదు పొదుపు చేసి అందజేశారు. కార్యక్రమంలో గ్రామ పటేల్ మడావి నరాంజి రావు, జంగు, మోతిరాం, గోవిందరావు, తుకారాం తదితరులు పాల్గొన్నారు.

News February 23, 2026

తలమడుగు: రూ 2,25,000 పలికిన లడ్డు

image

తలమడుగు మండలం బరంపూర్ కొండ పైన గల శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఆదివారం రాత్రి ఘనంగా ముగిశాయి. ఉత్సవాల ముగింపు సందర్భంగా నిర్వహించిన ‘అన్నమయ్య లడ్డు’ వేలం పాట భక్తుల మధ్య ఉత్సాహంగా సాగింది. గ్రామానికి చెందిన ఎల్టీ గోవర్ధన్ రెడ్డి ₹2,25000 చెల్లించి ఈ ప్రసాదాన్ని దక్కించుకున్నారు. స్వామివారి కృపతో లడ్డు దక్కడం తన అదృష్టమని ఆయన సంతోషం వ్యక్తం చేశారు.