News June 28, 2024

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు ఎల్లో అలర్ట్

image

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇవాళ, రేపు బలమైన గాలులతో మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ మేరకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. కాగా నిన్న కొమురం భీం ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లాలో వర్షాలు కురిసినట్లు పేర్కొంది. వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.

Similar News

News October 8, 2024

ఆదిలాబాద్: గ్రామాల్లో అప్పుడే మొదలైన ఎన్నికల హడావుడి

image

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా గ్రామాలలో పంచాయతీ ఎన్నికల హడావుడి మొదలైంది. సర్పంచ్‌గా పోటీ చేయడానికి ఆశావహులు అందరినీ ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఇప్పటికే ఆయా గ్రామాలలో పాత వారితో పాటు కొత్తగా బరిలో నిలవడానికి నేతలు ఆసక్తి చూపుతున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పంచాయతీలు ఈ విధంగా ఉన్నాయి. ఆదిలాబాద్‌లో 468, మంచిర్యాల 311, నిర్మల్ 396, ఆసిఫాబాద్‌లో 355 పంచాయతీలు ఉన్నాయి.

News October 7, 2024

భవిష్యత్తు కోసం అడవులను కాపాడుకుందాం:ఎఫ్ఆర్ఓ

image

భవిష్యత్తు కోసం అడవులను, వన్యప్రాణులను కాపాడుకుందామని కడెం మండలంలోని ఉడుంపూర్ ఎఫ్ఆర్ఓ అనిత సూచించారు. 70వ అటవీ సంరక్షణ వారోత్సవాలలో భాగంగా సోమవారం ఉడుంపూర్ పరిధిలోని అటవీ ప్రాంతాలలో ప్రజలకు పలు అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అడవులు, వన్యప్రాణులు ఉంటేనే మనిషికి మనుగడ ఉంటుందన్నారు. వాటిని కాపాడుకుందామని వారు కోరారు. ఈ కార్యక్రమంలో అటవీ అధికారులు, సిబ్బంది ఉన్నారు.

News October 7, 2024

బెజ్జూర్: ప్రమాదవశాత్తు బావిలో పడి మహిళా మృతి

image

ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండలంలో విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు బావిలో పడి మహిళ మృతి చెందింది. ఏఎస్ఐ మోహన్ తెలిపిన వివరాల ప్రకారం.. లంబాడిగూడకు చెందిన అల్లూరి లక్ష్మీ వ్యవసాయ పనుల నిమిత్తం పొలంకు వెళ్లింది. నీళ్లు తీసుకువచ్చే క్రమంలో కాలుజారి బావిలో పడి మృతి చెందింది. భర్త లింగయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఏఎస్సై తెలిపారు.