News August 6, 2024

ఉమ్మడి ఆదిలాబాద్ లోని నేటి CRIME REPORT

image

◆ నేరడిగొండ: తప్పిన పెను ప్రమాదం
◆ రెబ్బెన: ఐదు లీటర్ల గుడుంబా స్వాధీనం
◆ మంచిర్యాల: చికిత్స పొందుతూ హాస్టల్ వార్డెన్ మృతి
◆ బైంసా: మద్యానికి బానిసై వ్యక్తి ఆత్మహత్య
◆ సిరికొండ : అక్రమంగా నిల్వ ఉంచిన కలప పట్టివేత
◆ బైంసా: పెళ్లి కావడం లేదని యువకుడు ఆత్మహత్య
◆ నిర్మల్: అదృశ్యమైన వ్యక్తి.. శవమై తెలి
◆ తిర్యాని: లభించని గల్లంతైన యువకుడి సమాచారం
◆ దండేపల్లి: అక్రమంగా తరలిస్తున్న టేకు పట్టివేత

Similar News

News September 17, 2024

కాగజ్‌నగర్: లడ్డూ దక్కించుకున్న ముస్లిం దంపతులు

image

ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలం భట్టుపల్లిలో మతసామరస్యం వెల్లివిరిసింది. గ్రామంలోని శ్రీ విఘ్నేశ్వర గణేశ్ మండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక లడ్డూను వేలం పాటలో ముస్లిం దంపతులు దక్కించుకున్నారు. గ్రామానికి చెందిన అప్జల్- ముస్కాన్ దంపతులు రూ.13,216లకు వినాయకుని లడ్డూను వేలం పాటలో పాల్గొని కైవసం చేసుకున్నారు.

News September 16, 2024

రేపు ADBలో మద్యం దుకాణాలు మూసివేత

image

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఈనెల 17న మంగళవారం మద్యం దుకాణాలను మూసి వేయనున్నట్లు ఎక్సైజ్ సీఐ విజేందర్ తెలిపారు. పట్టణంలో మంగళవారం వినాయక నిమజ్జనం శోభాయాత్రను పురస్కరించుకొని జిల్లా కలెక్టర్ రాజర్షిషా ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. మద్యం వ్యాపారులు ఎవరైనా ఈ సమయాల్లో విక్రయాలు జరిపితే చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. తిరిగి బుధవారం యథావిధిగా దుకాణాలు తెరుస్తారని పేర్కొన్నారు.

News September 16, 2024

భైంసా: భార్య ఆత్మహత్యాయత్నం.. ఉరేసుకొని భర్త మృతి

image

కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన భైంసాలో సోమవారం చోటుచేసుకుంది. ఎస్ఐ శ్రీనివాస్ వివరాల ప్రకారం.. దెగాంకు చెందిన ఎర్రన్న(40) మద్యానికి బానిసై భార్య హంసతో గొడవకు దిగాడు. ఆమె మనస్తాపంతో పురుగు మందు తాగింది. కుటుంబీకులు భైంసా ఏరియాస్పత్రికి తరలించారు. కాగా చికిత్సపొందుతున్న భార్యతో మరోసారి గొడవపడి ఇంటికి వెళ్లి
ఎర్రన్న ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్ఐ వెల్లడించారు.