News November 20, 2024

ఉమ్మడి కడప జిల్లా నీటి సమస్యపై డిప్యూటీ సీఎం చర్చ

image

ఉమ్మడి కడప జిల్లాలోని నీటి సమస్యపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో చర్చించారు. ఆయన మాట్లాడుతూ..’ నేను ఓ సారి అన్నమయ్య జిల్లాలో పర్యటించాను. అప్పుడు రోడ్డు పక్కన ఉన్న ఓ ప్రాంతం వద్ద మహిళలను మీకు ఏం కావాలని అడిగా. ఓ మహిళ తాగునీళ్లు కావాలని అడిగింది. ఆమె అలా అడగడంతో నా కళ్లు చెమ్మగిల్లాయి’ అని పవన్ అన్నారు. ఆ సమస్యను తొమ్మిది రోజులలో తీర్చినట్లు తెలిపారు.

Similar News

News November 23, 2025

పొద్దుటూరు పోలీసుల చర్యతో ప్రజల్లో ఆందోళన..!

image

కొద్ది రోజులక్రితం ప్రొద్దుటూరులో వడ్డీ వ్యాపారి వేణుగోపాలరెడ్డిని కిడ్నాప్ చేసి హత్య చేసిన విషయం తెలిసిందే. ఆ ఘటన మరువకముందే శుక్రవారం రాత్రి పొద్దుటూరులో మరో బంగారు వ్యాపారి శ్రీనివాసులును కూడా కిడ్నాప్ చేశారు. ఈ మేరకు ఆయన భార్య లక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేశారు.పోలీసులు 24 గంటలు కుటుంబ సభ్యులకు, మీడియాకు సమాచారం ఇవ్వలేదన్న ఆరోపనలు ఉన్నాయి. శ్రీనివాసులును రక్షించాలని స్థానికులు పోలీసులను కోరారు.

News November 22, 2025

కడప: ‘27 నుంచి పీజీ మూడో సెమిస్టర్ పరీక్షలు’

image

YVU పీజీ మూడో సెమిస్టర్ పరీక్షలు ఈ నెల 27వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయని కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినేషన్ ప్రొఫెసర్ కృష్ణారావు తెలిపారు. MA, Mcom, Msc, ఎం.పి.ఎడ్ మూడో సెమిస్టర్ పరీక్షల టైం టేబుల్‌ను ఆయన ప్రకటించారు. ఈ నెల 27, 29, డిసెంబర్ 1, 3, 5, 8 తేదీల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్షలు ఉంటాయన్నారు.