News March 29, 2025
ఉమ్మడి కడప జిల్లా స్థాయిలో షటిల్ బ్యాడ్మింటన్

ఉమ్మడి కడప జిల్లా స్థాయిలో షటిల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ నిర్వహించనున్నట్లు ఎస్సై శ్రీధర్ శుక్రవారం తెలిపారు. ఈనెల 30, 31 తేదీలలో నందలూరు రైల్వే కేంద్రంలోని సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయిస్ సంఘ్ కార్యాలయంలో ఈ టోర్నమెంట్ నిర్వహించనున్నట్లు తెలిపారు. పోటీల్లో పాల్గొనేవారు ఈనెల 29లోపు తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు.
Similar News
News April 22, 2025
నస్పూర్: ‘రైస్ మిల్లర్లు సీఎంఆర్ బకాయిలను చెల్లించాలి’

జిల్లాలో యాసంగి 2022- 23 ఏడాదికి సంబంధించి రైస్ మిల్లర్లు వరి ధాన్యం బకాయిలను వెంటనే పూర్తిగా చెల్లించాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవారం నిర్వహించిన సమీక్షలో మాట్లాడారు. రైస్ మిల్లులకు కేటాయించిన లక్ష్యాలకు అనుగుణంగా ఆక్షన్ ధాన్యం బకాయి ఉన్న రూ.87 కోట్లతో పాటు రూ.కోటి లోపు ఉన్న వారు తక్షణమే చెల్లించాలన్నారు. లేనిపక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
News April 22, 2025
నటన నా రక్తంలోనే ఉంది.. త్వరలోనే రీఎంట్రీ: రంభ

తన పిల్లల కోసమే సినిమాలకు దూరమయ్యానని అలనాటి హీరోయిన్ రంభ వెల్లడించారు. ఇప్పుడు కుమార్తెలకు 14, 10 ఏళ్లు, కుమారుడికి 6 ఏళ్లు వచ్చాయన్నారు. ప్రస్తుతం భర్త ప్రోత్సాహంతో ఓ షోకు జడ్జిగా వ్యవహరిస్తున్నట్లు తెలిపారు. ఇండస్ట్రీకి 15 ఏళ్లు దూరమైనా నటన తన రక్తంలోనే ఉందని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. త్వరలోనే వెండితెరపై కనిపించాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నారు.
News April 22, 2025
నారాయణపేటకు నూతన వైద్యాధికారి

నారాయణపేట జిల్లా నూతన వైద్య శాఖ అధికారిగా డాక్టర్ జయ చంద్రమోహన్‌ను నియమిస్తూ శనివారం వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టినా జెడ్ చొంగ్తూ ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో ఇక్కడ DMHOగా పని చేసిన సౌభాగ్యలక్ష్మిపై అవినీతి ఆరోపణలు రావడంతో ఆధికారులు విచారణ చేసి కార్యదర్శికి నివేదికలు అందించారు. దీంతో ఆమెను హైదరాబాద్ కమిషనర్ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని కార్యదర్శి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.