News February 16, 2025

ఉమ్మడి కరీంగర్ జిల్లాలోని నేటి CRIME NEWS

image

@KNR-JGL ప్రధాన రహదారి పై వరుస ప్రమాదాలు.. భయందోళనలో ప్రజలు @KNR భూ కబ్జా ఘటన.. ఇరిగేషన్ అధికారుల పాత్ర పై పోలీస్ అధికారుల విచారణ @మెట్పల్లిలో ముగ్గురు దొంగల అరెస్ట్ @కథలాపూర్‌లో బంగారం దొంగలించిన ఇద్దరి యువతుల అరెస్ట్ @పెగడపల్లిలో పురుగు మందు తాగి వివాహిత ఆత్మహత్య @దమన్నపేటలో తాళం వేసిన ఉన్న ఇంట్లో బంగారం చోరీ @రాజన్న సిరిసిల్లలో ప్రాణం తీసిన సెల్ఫీ వీడియో

Similar News

News November 29, 2025

చారకొండ: ఎన్నికల బహిష్కరణకు ఎర్రవల్లి తీర్మానం

image

చారకొండ మండలంలోని ఎర్రవల్లి గ్రామ భూ నిర్వాసితుల కమిటీ సర్పంచ్‌ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు ఏకగ్రీవంగా తీర్మానించింది. రిజర్వాయర్ సమస్యపై ప్రభుత్వం స్పందించకపోవడం, గ్రామ అభిప్రాయం లేకుండా పునరావాస ప్యాకేజీలను ప్రకటించడం పట్ల గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రిజర్వాయర్ సామర్థ్యాన్ని తగ్గించి, గ్రామాన్ని ముంపు నుంచి కాపాడాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

News November 29, 2025

ChatGPTలో ఇది ఎప్పుడైనా గమనించారా?

image

అడ్వాన్స్‌డ్ AI టూల్ అయిన ChatGPT టైమ్‌ చెప్పలేకపోవడం చర్చగా మారింది. దీనికి ప్రధాన కారణంగా ChatGPTకి సిస్టమ్ టైమ్‌కు నేరుగా యాక్సెస్ ఉండకపోవడం. రియల్‌టైమ్ డేటా చేర్చడానికి కొన్ని టెక్నికల్ సమస్యలు ఉండటంతో పాటు AI గందరగోళానికి గురయ్యే ప్రమాదం ఉందని నిపుణులు అంటున్నారు. అయితే Gemini, Copilot, Grok వంటి AI టూల్స్ మాత్రం ఆటోమేటిక్‌గా టైమ్ చెప్తున్నాయి. ఈ సమస్యలను అధిగమించేందుకు OpenAI పనిచేస్తోంది.

News November 29, 2025

నిజామాబాద్: పరీక్షా కేంద్రాల వద్ద 163 సెక్షన్

image

డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఫస్ట్ ఇయర్ పరీక్షల నేపథ్యంలో నిజామాబాద్ సబ్ డివిజన్ పరీక్షా కేంద్రాల వద్ద డిసెంబర్ 1 నుంచి 6వ తేదీ వరకు ఉదయం 8గం.ల నుంచి మధ్యాహ్నం 1 గం. వరకు బీఎన్ఎస్ సెక్షన్ 163 అమలు చేయనున్నట్లు సీపీ సాయిచైతన్య తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద గుమిగూడరాదని, నిషేధిత వస్తువులతో పరీక్షా కేంద్రాల వద్ద తిరగవద్దని సీపీ సూచించారు.