News February 16, 2025
ఉమ్మడి కరీంగర్ జిల్లాలోని నేటి CRIME NEWS

@KNR-JGL ప్రధాన రహదారి పై వరుస ప్రమాదాలు.. భయందోళనలో ప్రజలు @KNR భూ కబ్జా ఘటన.. ఇరిగేషన్ అధికారుల పాత్ర పై పోలీస్ అధికారుల విచారణ @మెట్పల్లిలో ముగ్గురు దొంగల అరెస్ట్ @కథలాపూర్‌లో బంగారం దొంగలించిన ఇద్దరి యువతుల అరెస్ట్ @పెగడపల్లిలో పురుగు మందు తాగి వివాహిత ఆత్మహత్య @దమన్నపేటలో తాళం వేసిన ఉన్న ఇంట్లో బంగారం చోరీ @రాజన్న సిరిసిల్లలో ప్రాణం తీసిన సెల్ఫీ వీడియో
Similar News
News March 19, 2025
కశింకోట: హత్యకు గురైంది హిజ్రాగా గుర్తించిన పోలీసులు

కసింకోట మండలం బయ్యవరం వద్ద హత్యకు గురైంది హిజ్రాగా పోలీసులు గుర్తించారు. మృతదేహంలో సగభాగాన్ని గోనె సంచులో పెట్టి బయ్యవరం వద్ద గుర్తుతెలియని వ్యక్తులు వదిలిపెట్టి వెళ్లిపోయారు. మిగిలిన అవయవాలను అనకాపల్లి డైట్ కళాశాల ప్రాంతంలో పోలీసులు గుర్తించారు. హత్యకు గురైంది ముందు మహిళగా పోలీసులు భావించారు. కాగా దర్యాప్తులో హిజ్రాగా నిర్ధారణ అయింది.
News March 19, 2025
ఫోన్ ట్యాపింగ్.. వారిద్దరికీ రెడ్ కార్నర్ నోటీసులు

TG: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ SIB చీఫ్ ప్రభాకర్ రావు, ఓ మీడియా సంస్థ అధినేత శ్రవణ్ కుమార్‌కు రెడ్ కార్నర్ నోటీసులు జారీ అయినట్టు అధికారులు ప్రకటించారు. దీనిపై CBI నుంచి రాష్ట్ర సీఐడీకి సమాచారం వచ్చింది. వారిద్దరినీ వీలైనంత త్వరగా మన దేశానికి తీసుకొచ్చేందుకు కేంద్ర హోంశాఖ, విదేశాంగ శాఖలతో హైదరాబాద్ పోలీసులు సంప్రదింపులు జరుపుతున్నారు.
News March 19, 2025
సత్యసాయి: వినియోగదారులకు అందుబాటులో ఇసుక

ఇసుకను వినియోగదారులకు అందుబాటులో ఉంచుదామని శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ టీఎస్.చేతన్ పేర్కొన్నారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్, జిల్లా ఎస్పీ రత్నతో కలసి కలెక్టర్ సమావేశం నిర్వహించారు. నీటి ప్రవాహాలకు ఆనుకుని ఉన్న గ్రామాలలో గృహాల నిర్మాణం, ప్రభుత్వ పనులకు ఇసుకను ఉచితంగా తీసుకెళ్ళవచ్చునన్నారు.