News March 27, 2025
ఉమ్మడి కరీంనగర్లో రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ పర్యటన

రాజన్న సిరిసిల్లలో జిల్లాలో రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యుల పర్యటన వివరాలను ఛైర్మన్ బక్కి వెంకటయ్య విడుదల చేశారు. జగిత్యాల, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఏప్రిల్ 3, 4 తేదీల్లో దళితులపై చేసే దారుణాలు, భూ సమస్యలపై రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేసి బాధితులకు ఎలాంటి చట్టపరమైన సహాయం చేయనున్నట్లు తెలిపారు. సహాయనిధి, నిందితుల తీరుని ఎలా కట్టడి చేస్తున్నారు అనేదానిపైన సూచనలు, సలహాలు ఇవ్వనున్నారు.
Similar News
News December 8, 2025
ఫ్యూచర్ సిటీలోని ప్రదర్శన స్టాల్ వద్ద సందడి!

ఫ్యూచర్ సిటీలో ప్రదర్శన స్టాల్ ముఖ్య ఆకర్షణగా నిలిచింది. మీర్ఖాన్పేటలో ప్రతిపాదించిన ఈ భవిష్యత్తు నగర ప్రణాళికలను డిజిటల్ విజువల్స్ ద్వారా ప్రదర్శించారు. వంపు ఆకృతి నిర్మాణంతో కూడిన ఈ స్టాల్లో 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యంగా రూపొందించిన మాస్టర్ ప్లాన్ను అధికారులు వివరించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్టాల్ను సందర్శించారు.
News December 8, 2025
మన్యం బిడ్డను సత్కరించిన కలెక్టర్

అండర్-19 క్రికెట్ టీ-20 వరల్డ్ కప్లో భారత్ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించిన పాంగి కరుణకుమారిని సోమవారం కలెక్టరేట్లో కలెక్టర్ దినేష్ కుమార్ సోమవారం ప్రత్యేకంగా అభినందించారు. కరుణకుమారికి శాలువా కప్పి అల్లూరి సీతారామరాజు జ్ఞాపికను అందజేశారు. పాడేరు(M)లోని మారుమూల గ్రామమైన వంట్లమామిడిలో ఆదివాసీ కుటుంబంలో పుట్టిన కరుణకుమారి అంతర్జాతీయ క్రికెట్లో రాణించడం గొప్ప విషయమని కలెక్టర్ కొనియాడారు.
News December 8, 2025
తిరుచానూరు: అర్చకుల ముసుగులో ఒక్కరు కాదు ఇద్దరు

ఆలయంలో అర్చకులు అంటే భక్తులకు చాలా గౌరవం. కానీ టీటీడీ పరిధిలోని తిరుచానూరు ఆలయంలో పనిచేసే అర్చకుల ముసుగులో ఇద్దరు అనధికారికంగా ఉన్నట్లు టీటీడీ విజిలెన్స్ గుర్తించింది. ఎప్పటి నుంచి ఉన్నారు..? ఎవరి ద్వారా ఆలయంలో ఉన్నారు..? ఇంత జరుగుతున్నా ఎందుకు అధికారులు గుర్తించలేదనే వివరాలు నమోదు చేశారని తెలుస్తోంది. నేడో.. రేపో నివేదిక ఉన్నతాధికారులకు అందించనున్నారని సమాచారం.


