News March 20, 2025
ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు వర్ష సూచన.. ఎల్లో అలర్ట్

కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, సిరిసిల్ల జిల్లాల్లో గురు, శుక్రవారం అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, గాలులతో కూడిన వర్షాలు పడుతాయని వాతావరణశాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రాబోయే మూడురోజుల్లో ఉష్ణోగ్రతలు తగ్గినా.. తర్వాత మళ్లీ పెరిగే అవకాశం ఉందని తెలిపింది. ఎండవేడితో అల్లాడుతున్న ప్రజలకు ఇది కాస్త ఉపశమనం అయినప్పటికీ.. పంటలకు నష్టం జరిగే అవకాశం ఉందని రైతన్న ఆందోళన చెందుతున్నాడు.
Similar News
News February 23, 2026
RRR కస్టోడియల్ టార్చర్ కేసు.. సునీల్ నాయక్ అరెస్ట్

AP: రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. అప్పటి డీఐజీ సునీల్ నాయక్‌ను గుంటూరు పోలీసులు అరెస్టు చేశారు. బిహార్‌లో అదుపులోకి తీసుకొని ఏపీకి తరలిస్తున్నారు. కాగా ఇదే కేసులో సీఐడీ మాజీ చీఫ్ సునీల్ కుమార్‌పై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసిన విషయం తెలిసిందే.
News February 23, 2026
మక్తల్: కబడ్డీ ఆడిన క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి

మక్తల్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా జరుగుతున్న సెకండ్ ఎడిషన్ సీఎం కప్ కబడ్డీ ఛాంపియన్‌షిప్‌కు రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి హాజరయ్యారు. ఆయన క్రీడాకారులతో సరదాగా కబడ్డీ ఆడి అలరించారు. పురుషుల రంగారెడ్డి-గద్వాల్ , మహిళల రంగారెడ్డి-ఆదిలాబాద్ జట్ల మధ్య జరుగుతున్న సెమీ ఫైనల్ మ్యాచ్‌ను మంత్రి తిలకించారు. మ్యాచ్ ప్రారంభానికి ముందు ఆయా జట్ల వద్దకు వెళ్లి వారిని పరిచయం చేసుకున్నారు.
News February 23, 2026
HYD: తెలుగు వర్సిటీలో పురస్కారాలు.. దరఖాస్తు చేసుకోండి

MAR 27న ప్రపంచ రంగస్థల దినోత్సవం సందర్భంగా తెలుగు వర్సిటీలో యువ పురస్కార ప్రదానోత్సవం నిర్వహిస్తున్నట్లు రిజిస్ట్రార్ కోట్ల హనుమంతరావు Way2Newsతో తెలిపారు. నటన, దర్శకత్వం, మేకప్, లైటింగ్ ఇతర రంగాల్లో కృషిచేసిన యువత పురస్కారానికి దరఖాస్తు చేసుకోవచ్చు. వయసు 35ఏళ్లలోపు ఉన్నవారు అర్హులు. రిజిస్ట్రార్, సురవరం ప్రతాపరెడ్డి తెలుగు వర్సిటీ, బాచుపల్లికి పోస్టు ద్వారా/నేరుగా MAR 5లోపు అప్లికేషన్స్ పంపవచ్చు.


