News July 18, 2024
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

@ సిరిసిల్ల జిల్లాలో పర్యటించిన జాతీయ ఎస్టి కమిషన్ సభ్యుడు.
@ ఎల్లారెడ్డిపేట మండలంలో డివైడర్ను ఢీకొని యువకుడి మృతి.
@ ధర్మారం మండలంలో రెండు బైకులు ఢీకొని ఒకరి మృతి.
@ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ నాయకుల సంబరాలు.
@ భీమారం మండలంలో పురుగు మందు తాగి వివాహిత ఆత్మహత్య.
@ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పలుచోట్ల వర్షం.
Similar News
News September 16, 2025
KNR: పెండింగ్లో 1,810 దరఖాస్తులు

కరీంనగర్ జిల్లా కేంద్రంలో ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన దరఖాస్తులకు ప్రథమ ప్రాధాన్యత ఇచ్చి వేగవంతంగా పరిష్కరిస్తున్నామని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. సోమవారం ప్రజావాణి కార్యక్రమం అనంతరం జిల్లా అధికారులతో పలు అంశాలపై ఆమె సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. 2021 ఫిబ్రవరి నుంచి 27,580 దరఖాస్తులు రాగా 1,810 దరఖాస్తులు మాత్రమే పెండింగ్లో ఉన్నాయన్నారు.
News September 15, 2025
కరీంనగర్: ఉరివేసుకుని వ్యక్తి ఆత్మహత్య

కరీంనగర్లోని కిసాన్నగర్లో గంగుల సురేష్ అనే వ్యక్తి ఆర్థిక సమస్యలతో బాధపడుతూ సోమవారం సాయంత్రం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News September 15, 2025
KNR: ‘పోషణ మాసోత్సవాలు విజయవంతం చేయాలి’

మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్న పోషణ మాసోత్సవాలపై వివిధ శాఖల అధికారులతో సోమవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో సమన్వయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే మాట్లాడుతూ.. ఈనెల 17 నుంచి వచ్చే నెల 16 వరకు జిల్లాలో నిర్వహించనున్న పోషణ మాసోత్సవాలను విజయవంతం చేయాలని అన్నారు. అనంతరం పోషణ మాసోత్సవాల పోస్టర్ ఆవిష్కరించారు.