News August 6, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ప్రొఫెసర్ జయశంకర్ జయంతి. @ మెట్పల్లి లో గంజాయి తరలిస్తున్న ఇద్దరు యువకుల అరెస్ట్. @ గంగాధర మండలంలో లారీ, బస్సు ఢీ.. లారీ డ్రైవర్ మృతి. @ చందుర్తి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యదర్శి సస్పెండ్. @ హుస్నాబాద్‌లో గద్దర్ వర్ధంతిలో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్. @ ఓదెల మండలంలో వ్యక్తి ఆత్మహత్య.

Similar News

News September 10, 2024

జగిత్యాల: మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలి: కలెక్టర్

image

జగిత్యాల జిల్లాలోని సీజనల్ వ్యాధులపై జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్ ఆధ్వర్యంలో మెడికల్ ఆఫీసర్లు, హెల్త్ సూపెర్వైజర్‌లతో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లాలో డెంగీ సిచ్యుయేషన్ ఏ విధంగా ఉందని పలు అంశాలపై మాట్లాడారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అన్ని గ్రామాల్లో ఫాగింగ్ చేయాలనీ, పిచ్చి మొక్కల్ని తొలిగించి జ్వరాలు వచ్చే చోట మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని సూచించారు.

News September 10, 2024

మంత్రి పొన్నం ప్రభాకర్‌పై మండిపడ్డ మేయర్ సునీల్ రావు

image

మంత్రి పొన్నం ప్రభాకర్‌పై కరీంనగర్ మేయర్ సునీల్ రావు మండిపడ్డారు. నగరంలో ఆయన మాట్లాడాతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 10 నెలలు అవుతుందని, బాధ్యత గల మంత్రిగా కరీంనగర్ నగరపాలక సంస్థ అభివృద్ధికి పొన్నం ఒక్క రూపాయి మంజూరు చేయలేదన్నారు. నగరంలో 3 నెలల క్రితం తమకు సమాచారం లేకుండా మున్సిపల్ సమీక్ష సమావేశం చేశారని, తమ నియోజకవర్గాన్ని పట్టించుకోకుండా కరీంనగర్లో సమావేశాలు పెట్టడమేంటని ప్రశ్నించారు.

News September 10, 2024

సిరిసిల్ల పట్టణ పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ

image

సిరిసిల్ల పట్టణ పోలీస్ స్టేషన్‌ను జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆకస్మిక తనిఖీ చేశారు. స్టేషన్ పరిసరాలను, స్టేషన్ పరిధిలో నమోదవుతున్న, నమోదైన కేసుల వివరాలు, స్టేషన్ రికార్డ్‌లను తనిఖీ చేశారు. కేసుల దర్యాప్తు విషయంలో అధికారులు అలసత్వం వహించొద్దన్నారు. ప్రజా ఫిర్యాదులలో ఎలాంటి జాప్యం చేయకుండా బాధితుల పట్ల తక్షణమే స్పందించాలన్నారు. ప్రజలకు ఎల్లపుడు అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యలను తీర్చాలని సూచించారు.