News August 25, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ వేములవాడలో జరిగిన మెగా జాబ్ మేళ. @ కాల్వ శ్రీరాంపూర్ మండలంలో ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు ధర్నా. @ ధర్మారం మండలంలో జ్వరంతో యువకుడి మృతి. @ ఇబ్రహీంపట్నం మండలంలో పురుగుల మందు తాగి ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య. @ ధర్మపురి మండలంలో మహిళ ఆత్మహత్య. @ వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ. @ ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసిన పెద్దపల్లి కలెక్టర్. @ జగిత్యాల జిల్లాలో 204 డెంగ్యూ కేసులు.

Similar News

News September 20, 2024

త్రిసభ్య కమిటీలో కోరుట్ల ఎమ్మెల్యేకు చోటు

image

రాష్ట్రంలో వైద్య, ఆరోగ్య పరిస్థితులపైన స్టడీ చేయడానికి త్రిసభ్య కమిటీని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నియమించారు. మాజీ ఆరోగ్య శాఖ మంత్రి రాజయ్య అధ్యక్షతన కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్, మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌లతో కలిపి కమిటీ ఏర్పాటు చేశారు. హైదరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు రాష్ట్రంలోని పలు అసుపత్రులను సందర్శించి ప్రభుత్వానికి ఈ కమిటీ నివేదిక అందించనుంది.

News September 20, 2024

KNR: ఇక ఉపాధ్యాయులకు ఫేస్ రికగ్నిషన్ యాప్!

image

ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల హాజరు విషయంలో నిక్కచ్చిగా వ్యవహరించేందుకు విద్యాశాఖ.. ఉపాధ్యాయులకు ఫేస్ రికగ్నిషన్ యాప్‌ను అమలు చేసేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. ఈ మేరకు జిల్లా విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు అందినట్లు సమాచారం. దీంతో ఉపాధ్యాయులు సమయపాలన పాటించేలా ప్రభుత్వం చర్యలకు ఉపక్రమిస్తోంది. కాగా, జిల్లాలోని 651 ప్రభుత్వ పాఠశాలల్లో బోధన, బోధనేతర సిబ్బంది 2,729 మంది పనిచేస్తున్నారు.

News September 20, 2024

కరీంనగర్: తీరనున్న గల్ఫ్ కష్టాలు!

image

ఎట్టకేలకు గల్ఫ్ కార్మికుల సమస్యలపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. కార్మికుల సమస్యలపై సలహా కమిటీ ఏర్పాటు, గల్ఫ్ కార్మికుల విద్యార్థులకు గురుకుల విద్యాలయాల్లో సీట్ల కేటాయింపుకు ప్రాధాన్యత, డిసెంబర్ 7, 2023 నుంచి గల్ఫ్‌లో మరణించిన కార్మికుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం అందించాలని నిర్ణయించింది. కాగా, ఉమ్మడి జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ, జగిత్యాల, మెట్పల్లి, కోరుట్లకు చెందిన యువత గల్ఫ్ బాట పట్టారు.