News September 2, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న జగిత్యాల కలెక్టర్.
@ జగిత్యాల జిల్లా వ్యాప్తంగా సిటీ పోలీస్ యాక్ట్ అమలు.
@ జమ్మికుంటలో రైలు కిందపడి యువకుడి ఆత్మహత్య.
@ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి.
@ బెజ్జంకి మండలంలో చేపల వేటకు వెళ్లి ఒకరు గల్లంతు.
@ ఇబ్రహీంపట్నం, మల్లాపూర్, ధర్మపురి మండలాలలో పర్యటించిన జగిత్యాల కలెక్టర్, ఎస్పీ.

Similar News

News September 13, 2024

నంది మేడారం: డిప్యూటీ సీఎం పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు: ప్రభుత్వ విప్

image

పెద్దపల్లి జిల్లాలో ఈనెల 14న డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పర్యటన కు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. శుక్రవారం ఆయన ధర్మారం మండలం నంది మేడారం పంప్ హౌస్ వద్ద ఏర్పాటు చేసిన హెలీప్యాడ్‌ను కలెక్టర్ కోయ శ్రీ హర్ష, రామగుండం సీపీ శ్రీనివాస్‌లతో కలిసి పరిశీలించారు. ఉపముఖ్యమంత్రి పర్యటనకు అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా పూర్తి చేయాలని ఆదేశించారు.

News September 13, 2024

CM రేవంత్ రెడ్డిని కలిసిన రామగుండం MLA

image

రామగుండం MLA రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ ఈరోజు HYDలోని CM రేవంత్ రెడ్డి కార్యాలయంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఇటీవల రామగుండంలో 1,800 మెగావాట్ల విద్యుత్ ప్లాంటు ఏర్పాటుకు శ్రీకారం చుట్టడంతో CMకు కృతజ్ఞతలు తెలిపారు. అదే విధంగా రామగుండం మెడికల్ కాలేజీలో అదనంగా నర్సింగ్, పారా మెడికల్, ఫిజియోథెరపీ విభాగాలు ఏర్పాటు చేయాలని కోరారు. దీనికి CM సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు.

News September 13, 2024

కరీంనగర్: రుణమాఫీపై స్పష్టత ఏది!

image

రుణమాఫీ కాలేదని ఇటీవల జగిత్యాల జిల్లా భూషణరావుపేట చెందిన రైతు ఏనుగు సాగర్ రెడ్డి ఆత్మహత్యాయత్నం చేసుకోవడం రైతులతో పాటు అందరినీ తీవ్రంగా కలిచివేసింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా రుణమాఫీ కానీ రైతులు వేల సంఖ్యలో ఉన్నారు. రుణమాఫీ కాక రైతులు ఆవేదనతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. రెండు లక్షల పైన ఉన్న డబ్బులు కట్టాలా..? వద్దా…? కడితే.. ఎప్పుడు రుణమాఫీ చేస్తారో తెలియని పరిస్థితిలో రైతులు ఉన్నారు.