News October 11, 2024
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

@ కరీంనగర్ లో రెస్టారెంట్లలో తనిఖీలు. @ వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ. @ కథలాపూర్ మండలంలో సైబర్ మోసం. @ వీర్నపల్లి మండలంలో ఆర్టీసీ బస్సు, స్కూటర్ డీ.. ఒకరికి తీవ్ర గాయాలు. @ వేములవాడ: అనారోగ్యంతో ప్రధానోపాధ్యాయురాలు మృతి. @ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్న దుర్గ నవరాత్రి ఉత్సవాలు. @ దసరా పండుగ ప్రశాంతంగా జరుపుకోవాలన్న జగిత్యాల ఎస్పీ.
Similar News
News November 12, 2025
హుజురాబాద్: రోడ్డు యాక్సిడెంట్ వ్యక్తి మృతి

హుజురాబాద్ మండలం పోతిరెడ్డిపేట నుంచి హర్షిత్, త్రినేష్ ద్విచక్ర వాహనంపై హుజురాబాద్ వైపు వెళ్తుండగా సిరిసపల్లి క్రాస్ రోడ్డు వద్ద గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో హర్షిత్, త్రినేష్లకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం వరంగల్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ హర్షిత్ మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News November 12, 2025
కరీంనగర్: ఆస్తి కోసం వేధిస్తున్న కొడుకు, కొడలుపై ఫిర్యాదు

ఆస్తి కోసం తెల్ల కాగితం మీద సంతకం చేయించుకొని ఆస్తి కాజేయాలని తన కొడుకు, కోడలు ప్రయత్నిస్తున్నారని HZB ఆర్డీఓకు వృద్ధ దంపతులు ఫిర్యాదు చేశారు. జమ్మికుంటకు చెందిన గుల్లి లక్ష్మీ-మొగిలిలకు ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నట్లు చెప్పారు. పెద్ద కొడుకు, కోడలు సంపత్-స్వరూప తెల్ల కాగితం మీద సంతకాలు చేయించుకుని ఆస్తి కాజేయాలని చూస్తున్నారని ఆర్డీవోకు ఫిర్యాదు చేశారు. తమకు రక్షణ కల్పించాలని వారు కోరారు.
News November 12, 2025
కరీంనగర్ జిల్లా విద్యాధికారిగా అశ్విని తానాజీ వాంఖడే

కరీంనగర్ జిల్లా నూతన విద్యాధికారిగా అడిషనల్ కలెక్టర్ (లోకల్ బాడీస్) అశ్విని తానాజీ వాంఖడేకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇది వరకే ఉన్న జిల్లా విద్యాధికారి చైతన్య జైనిని ఖమ్మం జిల్లాకు బదిలీ చేసిన విషయం తెలిసిందే. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఆమె విద్యాధికారిగా కొనసాగనున్నారు.


