News April 7, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ మల్యాల మండలంలో ఉరివేసుకుని మహిళ ఆత్మహత్య. @ కోరుట్ల మండలంలో ద్విచక్ర వాహనం అదుపుతప్పి వ్యక్తి మృతి. @ ఎల్లారెడ్డిపేట మండలంలో నెంబర్ ప్లేట్లు లేని వాహనాల పట్టివేత. @ ఓదెల మల్లన్న ఆలయంలో భక్తుల రద్దీ. @ మెట్పల్లి మండలం కొండ్రికర్ల లో వైభవంగా మల్లన్న జాతర. @ కోనరావుపేట మండలంలో చెరువులో చేపల మృతి. @ జగిత్యాల జిల్లా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా జలపతి రెడ్డి.

Similar News

News December 27, 2024

KNR: నేడు జరిగే సెమిస్టర్ పరీక్ష వాయిదా!

image

KNR శాతవాహన యూనివర్సిటీ పరిధిలో సెమిస్టర్ పరీక్షలు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే నేడు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతికి సంతాప సూచకంగా రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించగా నేటి సెమిస్టరు పరీక్షను వాయిదా వేసినట్లు యూనివర్సిటీ అధికారులు తెలిపారు. రేపటి నుంచి జరగాల్సిన యూనివర్సిటీ పరీక్షలు యథావిధిగా జరుగుతాయాన్నారు. కాగా, నేటి పరీక్ష నిర్వహణ మళ్లీ ఎప్పుడు అనేది ప్రకటిస్తామన్నారు.

News December 27, 2024

కరీంనగర్ బస్టాండ్‌కు 44 ఏళ్లు పూర్తి

image

కరీంనగర్ బస్టాండ్ ఏర్పాటు చేసి నేటితో 44 ఏళ్లు పూర్తిచేసుకుంది. తెలంగాణలో HYD MG బస్టాండ్ తర్వాత అతిపెద్ద బస్టాండ్ KNR బస్టాండ్‌ కావడం విశేషం. 11 నవంబరు, 1976లో అప్పటి సీఎం జలగం వెంగళరావు KNR బస్టాండ్‌కు శంకుస్థాపన చేశారు. డిసెంబరు 27, 1980న అప్పటి భారత విదేశాంగ శాఖామంత్రి పీవీ నరసింహరావు ప్రారంభించారు. ఈ బస్టాండ్ పూర్తిచేయడానికి 4 ఏళ్లు పట్టింది. మొత్తం 44 ప్లాట్ ఫాంలు ఉన్నాయి.

News December 27, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ ధర్మపురిలో భర్తపై జీడి రసంతో దాడి చేసిన భార్య. @ వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ. @ ఎల్లారెడ్డిపేట మండలంలో విద్యుత్ షాక్ తో మహిళ మృతి. @ మెట్పల్లి పట్టణంలో వైభవంగా అయ్యప్ప మహా పడిపూజ. @ సిరిసిల్ల జిల్లాలో లారీ, కారు ఢీ.. ఒకరి మృతి. @ గొల్లపల్లి మండలంలో ఉరివేసుకుని యువకుడు ఆత్మహత్య. @ కరీంనగర్‌లో సైబర్ మోసం.