News October 24, 2024
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్
@ కోనరావుపేట మండలంలో కుక్క దాడిలో ముగ్గురికి తీవ్ర గాయాలు.
@ వేములవాడలో తాగిన మైకంలో కూతురిని విక్రయించిన తల్లి.
@ సిరిసిల్లలో పోలీసుల భార్యల ధర్నా.
@ జగిత్యాల రూరల్ మండలంలో పల్లె ప్రకృతి వనాన్ని, వైకుంఠధామన్ని పరిశీలించిన కలెక్టర్.
@ వేములవాడ మండలంలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం.
@ మెట్పల్లిలో కేటీఆర్‌కు ఘన స్వాగతం.
Similar News
News November 10, 2024
మెట్‌పల్లి ఎమ్మెల్యేగా జ్యోతి నియంతృత్వ పాలనను ఎదిరించారు: MLC
మెట్‌పల్లి మాజీ ఎమ్మెల్యే కొమిరెడ్డి జ్యోతి పార్థివ దేహానికి ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిలు నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపారు. నియంతృత్వ పాలనను ఎదురించడంలో ఆనాడు కరీంనగర్ జిల్లా నుంచి తమతో పాటు ఎమ్మెల్యేగా జ్యోతి ముందు వరుసలో ఉండేదని జీవన్ రెడ్డి గుర్తు చేసుకున్నారు. శాసనసభలోనే కాకుండా అన్ని రంగాలలో మహిళల హక్కుల కోసం జ్యోతి పోరాటం చేసారన్నారు.
News November 10, 2024
సీఎం, మంత్రి వెంకట్ రెడ్డిపై కోరుట్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు
జగిత్యాల జిల్లా కోరుట్ల పోలీస్ స్టేషన్లో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై స్థానిక బీఆర్ఎస్ నాయకులు ఫిర్యాదు చేశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్‌లను దూషించిన సీఎం రేవంత్ రెడ్డిపై, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు.
News November 10, 2024
నేడు దద్దరిల్లనున్న పెద్దపల్లి!
పెద్దపల్లిలోని జెండా చౌరస్తా వద్ద ఈరోజు సాయంత్రం 4 గంటలకు అఖిల భారత యాదవ సంఘం, యువజన విభాగం ఆధ్వర్యంలో సదర్ ఉత్సవం నిర్వహించనున్నట్లు తెలిపారు. మొట్టమొదటిసారిగా పెద్దపల్లి జిల్లాలో నిర్వహిస్తున్న ఉత్సవానికి రాజకీయ, కుల మతాలకు అతీతంగా అందరూ పాల్గొని విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరుతున్నారు.