News November 17, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ జగిత్యాల జిల్లాలో గ్రూప్ 3 పరీక్ష కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్. @ తిమ్మాపూర్ మండలంలో రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి @ తంగళ్ళపల్లి మండలంలో హార్వెస్టర్, పెళ్లి బస్సు ఢీ.. బస్సు డ్రైవర్‌కు గాయాలు @ వేములవాడలో సీఎం పర్యటనకు ఏర్పాట్లను పరిశీలించిన అధికారులు ప్రజాప్రతినిధులు. @ కోరుట్లలో పార్కింగ్ చేసిన స్కూటీ డిక్కి నుంచి లక్ష నగదు చోరీ

Similar News

News December 9, 2025

KNR: నకిలీ బ్యాలెట్ పత్రాలు.. సర్పంచ్ అభ్యర్థి సహా నలుగురిపై కేసు

image

మానకొండూరు మండలం చెంజర్లలో ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తూ నకిలీ నమూనా బ్యాలెట్ పత్రాలు పంపిణీ చేసినందుకు సర్పంచ్ అభ్యర్థి గడ్ది రేణుక(కత్తెర గుర్తు)తో సహా నలుగురిపై కేసు నమోదైంది. వీరు ఫుట్‌బాల్ గుర్తు అభ్యర్థి సీరియల్ నంబర్‌ను తప్పుగా ముద్రించి, NOTA స్థానంలో సరైన సీరియల్ నంబర్‌ను ఉంచి ఓటర్లను తప్పుదోవ పట్టించేందుకు యత్నించినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోంది.

News December 9, 2025

KNR కమిషనరేట్‌లో 19 శాతం సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలు

image

కరీంనగర్ జిల్లాలోని గ్రామ పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు పటిష్ఠ భద్రతా చర్యలు చేపట్టినట్లు కరీంనగర్ సీపీ గౌష్ ఆలం తెలిపారు. కమిషనరేట్‌లో 19 శాతం సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలను గుర్తించి, అదనపు బలగాలను మోహరిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. మొత్తం 104 క్లస్టర్లలో పెట్రోలింగ్‌తో పాటు, ఏసీపీ స్థాయి అధికారుల ఆధ్వర్యంలో స్ట్రైకింగ్‌ ఫోర్స్‌ను సిద్ధం చేసినట్లు వెల్లడించారు.

News December 9, 2025

‘ఐదుగురు, అంతకంటే ఎక్కువమంది గుమికూడొద్దు’

image

కరీంనగర్ తొలి దశ గ్రామపంచాయతీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేసినట్లు CP గౌష్ ఆలం తెలిపారు. రూరల్ డివిజన్‌లోని ఐదు మండలాల్లో BNSS సెక్షన్ 163 కింద నిషేధాజ్ఞలు విధించామన్నారు. ఈ ఉత్తర్వులు ఇవాళ సాయంత్రం 5 గంటల నుంచి DEC 11 రాత్రి 11:59 గంటల వరకు అమలులో ఉంటాయన్నారు. ఐదుగురు అంతకంటే ఎక్కువ మంది గుమికూడటంపై పూర్తి నిషేధం అమలులో ఉంటుందన్నారు. ఉల్లంఘించిన వారిపై చర్యలు తప్పవన్నారు.