News November 17, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ జగిత్యాల జిల్లాలో గ్రూప్ 3 పరీక్ష కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్. @ తిమ్మాపూర్ మండలంలో రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి @ తంగళ్ళపల్లి మండలంలో హార్వెస్టర్, పెళ్లి బస్సు ఢీ.. బస్సు డ్రైవర్‌కు గాయాలు @ వేములవాడలో సీఎం పర్యటనకు ఏర్పాట్లను పరిశీలించిన అధికారులు ప్రజాప్రతినిధులు. @ కోరుట్లలో పార్కింగ్ చేసిన స్కూటీ డిక్కి నుంచి లక్ష నగదు చోరీ

Similar News

News April 10, 2026

KNR: రోడ్డు భద్రతే లక్ష్యం: సీపీ గౌష్ ఆలం

image

రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా ఏప్రిల్ 13 నుంచి 18 వరకు కరీంనగర్ జిల్లాలో ‘ARRIVE – ALIVE’ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు సీపీ గౌష్ ఆలం తెలిపారు. ‘ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక’లో భాగంగా గ్రామ కమిటీల ఏర్పాటు, బ్లాక్ స్పాట్స్ గుర్తింపు, విద్యార్థులకు అవగాహన కల్పిస్తామన్నారు. 18న ‘నో ఫైన్ డే’ నిర్వహించి కౌన్సిలింగ్ ఇస్తామని, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించి పోలీసులకు సహకరించాలని ఆయన కోరారు.

News April 10, 2026

కరీంనగర్ కార్పొరేషన్‌లో కో-ఆప్షన్ సభ్యుల ఎంపికకు నోటిఫికేషన్

image

కరీంనగర్ నగర పాలక సంస్థలో కో-ఆప్షన్ సభ్యుల ఎంపికకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రత్యేక పరిజ్ఞానం లేదా అనుభవం కలిగిన ముగ్గురు సభ్యులు (ఒక మహిళ, ఇద్దరు పురుషులు) మైనారిటీ వర్గాలకు చెందిన ఇద్దరు సభ్యులను ఎంపిక చేయనున్నారు. కనీసం 21 సంవత్సరాల వయస్సు కలిగి ఉండాలి. ఆసక్తి గల అభ్యర్థులు అవసరమైన పత్రాలతో ఏప్రిల్ 16, 2026 సాయంత్రం 5 గంటలలోపు కమిషనర్‌కు దరఖాస్తు సమర్పించాలి.

News April 10, 2026

KNR: పాడిపశువుల పథకం దరఖాస్తు గడువు పొడిగింపు

image

తెలంగాణ షెడ్యూల్డ్ కులాల సహకార అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో 2025-26 ఎస్సీ యాక్షన్ ప్లాన్‌లో భాగంగా అమలు చేస్తున్న ‘2 పాడి పశువుల పథకం’ దరఖాస్తు గడువు పొడిగించారు. ఈ మేరకు గురువారం ఉత్తర్వులు విడుదలయ్యాయి. ఈ నెల16 వరకు OBMMS పోర్టల్‌లో దరఖాస్తు చేసి, ఆధార్, రేషన్, కులం, ఆదాయం, బ్యాంక్ పాస్‌బుక్, భూమి పట్టా పత్రాలతో MPDO/ మునిసిపల్ కార్యాలయంలో సమర్పించాలని కరీంనగర్ కలెక్టర్ చిత్రా మిశ్రా తెలిపారు.