News March 19, 2024
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్
@ కాటారం పోలీస్ స్టేషన్లో రౌడీషీటర్లకు పోలీసుల కౌన్సిలింగ్. @ పెద్దపల్లి మండలంలో తాటి చెట్టు పై నుండి పడి గీత కార్మికుడికి తీవ్ర గాయాలు. @ సైదాపూర్ మండలంలో పురుగుల మందు తాగి వృద్ధుడు ఆత్మహత్య. @ ఇబ్రహీంపట్నం మండలంలో మాజీ భర్త పై యాసిడ్ దాడి.. కేసు నమోదు. @ వెల్గటూర్ మండలంలో హత్య కేసు నిందితులకు జీవిత ఖైదీ. @ ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలపై అవగాహన కలిగి ఉండాలన్న సిరిసిల్ల కలెక్టర్
Similar News
News January 9, 2025
భీమదేవరపల్లి: రేపటి నుంచి వీరభద్ర స్వామి బ్రహ్మోత్సవాలు
కొత్తకొండ వీరభద్ర స్వామి బ్రహ్మోత్సవాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. 10న స్వామి వారి కళ్యాణం, 11న త్రిశూలార్చన, 12న లక్షబిల్వర్చన, 13న భోగి పండుగ, 14న సంక్రాంతి పండుగ సందర్భంగా బండ్లు తిరుగుట,15న కనుమ ఉత్సవం,16న పుష్పయాగం, నాగవళ్లి, 17న త్రిశూల స్నానం కార్యక్రమం నిర్వహించినట్లు ఆలయ ఈఓ కిషన్ రావు తెలిపారు.
News January 9, 2025
తొక్కిసలాట ఘటన బాధాకరం: శ్రీధర్ బాబు
తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన తొక్కిసలాట ఘటనపై మంత్రి శ్రీధర్ బాబు స్పందించారు. తొక్కిసలాటలో ఆరుగురు ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరమన్నారు. ప్రాణాలు కోల్పోయిన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. అలాగే గాయపడ్డ భక్తులు త్వరగా కోలుకోవాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నట్లు Xలో పేర్కొన్నారు.
News January 9, 2025
తిరుమలలో తొక్కిసలాట అత్యంత బాధాకరం: KNR MLA
తిరుమలలో జరిగిన తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ X ద్వారా ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఇలాంటి ఘటనలు మరోసారి పునరావృతం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని టీటీడీ అధికారులకు విజ్ఞప్తి చేశారు. దైవ దర్శనానికి వచ్చిన భక్తులు తమ ప్రాణాలను కోల్పోవడం అత్యంత బాధాకర విషయం అన్నారు.