News April 9, 2024
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

*ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా వైభవంగా ఉగాది పర్వదిన వేడుకలు.
*KNR: అగ్గిపెట్టెలో పట్టే పట్టు వస్త్రం బహూకరణ (VIDEO)
*భక్తులతో కిటకిటలాడిన ఓదెల మల్లన్న ఆలయం.
*భీమదేవరపల్లి మండలంలో ఆరుగురు పేకాటరాయుళ్ల పట్టివేత.
*పుష్ప2 సినిమా సాంగ్‌లో పాల్గొన్న మల్యాల మండల యువకులు.
*కాటారం మండలంలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం.
*ధర్మారం మండలంలో వృద్ధుడిపై ఫోక్సో కేసు నమోదు.
Similar News
News March 15, 2025
KNR: మోసాలకు గురవుతున్న వినియోగదారుడు!

మార్కెట్ ఏదైనా మోసాలకు గురవుతున్నది మాత్రం వినియోగదారుడే. తనకు జరిగిన అన్యాయాన్ని వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదులు చేయకపోవడం వల్ల వ్యాపారుల అక్రమాలకు గురవుతున్నారు. కరీంనగర్ జిల్లాలో న్యాయం చేయడానికి వినియోగదారుల ఫోరం కోర్టు ఉన్నా ప్రజల అవగాహన లేమితో వినియోగించుకుంటోంది తక్కువే. నేడు ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం. వినియోగదారుల హక్కులను తెలుసుకొని వ్యాపారుల మోసాలకు అడ్డుకట్ట వేయండి.
News March 15, 2025
ధర్మపురి: బ్రహ్మోత్సవంలో సంస్కృతి నాట్య నీరాజనం

ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా కరీంనగర్‌కు చెందినటువంటి సంస్కృతి సంగీత నృత్యాలయం చిన్నారులు కూచిపూడి నృత్యాలతో భక్తులను మంత్రముగ్ధులను చేశారు. రామా కోదండరామ, అన్నమాచార్య కీర్తన, అంతయు నీవే సౌభాగ్యలక్ష్మీ, రావమ్మ ఆనంద తాండవ, మాడెన్ శివుడు నృత్యాలు చేశారు. అధిక సంఖ్యలో భక్తులు, ఈవో శ్రీనివాస్, గణేష్, నాట్యచార్యులు సురేంద్రచారి కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
News March 14, 2025
పోలీసుల కస్టడీలో పెద్దపల్లి వాసి అనుమానాస్పద మృతి

నిజామాబాద్‌లో పోలీసుల కస్టడీలో ఉన్న ఒక గల్ఫ్ ఏజెంట్ మృతిచెందాడు. బాధిత కుటుంబీకుల ప్రకారం.. JGTL చెందిన చిరంజీవి, PDPLకి చెందిన సంపత్ ఇరువురు కలిసి గల్ఫ్‌కు కొందరిని పంపించారు. తీరా అక్కడికి వెళ్లిన వారికి పనిలేకపోవడంతో వారు తిరిగొచ్చి సంపత్, చిరంజీవిపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టు ద్వారా 2రోజుల క్రితం కస్టడీలోకి తీసుకోగా సంపత్ మృతిచెందాడు.