News November 27, 2024
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

@ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు. @ ఇబ్రహీంపట్నం మండలంలో ఉరివేసుకొని యువతి ఆత్మహత్య. @ మెట్పల్లి మండలంలో గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన జగిత్యాల కలెక్టర్. @ పెద్దాపూర్ గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన కోరుట్ల ఎమ్మెల్యే. @ జగిత్యాల జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేసిన అడిషనల్ కలెక్టర్.
Similar News
News November 15, 2025
కఠోర శ్రమతోనే లక్ష్య సాధన: కలెక్టర్

విద్యార్థులు ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని, దానిని సాధించేందుకు నిత్యం కఠోరంగా శ్రమించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పిలుపునిచ్చారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఆమె మాట్లాడుతూ.. బాలబాలికలు అనవసర విషయాలను పట్టించుకోకుండా, తమ ధ్యాసనంతా చదువుపైనే కేంద్రీకరించాలని సూచించారు.
News November 15, 2025
KNR: టాస్క్ జాబ్ మేళాకు విశేష స్పందన.. 54 మంది షార్ట్లిస్ట్

KNR IT టవర్లోని టాస్క్ కార్యాలయంలో నిర్వహించిన జాబ్ మేళాకు విశేష స్పందన లభించింది. మొత్తం 209 మంది అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారని టాస్క్ ప్రతినిధులు తెలిపారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి పరీక్ష నిర్వహించగా, 54 మంది అభ్యర్థులు షార్ట్లిస్ట్ అయ్యారు. వీరికి త్వరలో తుది రౌండ్ ఇంటర్వ్యూలు నిర్వహించి ఉద్యోగాలకు ఎంపిక చేస్తామని వారు వెల్లడించారు.
News November 15, 2025
కరీంనగర్: బ్లూ కోల్ట్స్ విభాగంలో మహిళ పోలీస్ కానిస్టేబుళ్లు సత్తా

బ్లూ కోల్ట్స్ విభాగంలో కరీంనగర్ కమిషనరేట్ పరిధిలోని మహిళ పోలీస్ కానిస్టేబుళ్లు రాణిస్తున్నారు. 2016లో అప్పటి సీపీ కమలహాసన్ రెడ్డి పురుషల బ్లూ కోల్ట్స్ను ప్రారంభించారు. మహిళా పోలీసుల సంఖ్య క్రమంగా పెరగడంతో సీపీ గౌష్ ఆలం సెప్టెంబర్లో మహిళ బ్లూ కోల్ట్స్ సేవలను ప్రారంభించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు, కమ్యూనిటీ సమావేశాలుతో పాటు అన్ని విభాగాలలో పురుష పోలీసులతో సమానంగా రాణిస్తున్నారు.


