News November 29, 2024
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్
@ కథలాపూర్ మండలంలో మోడల్ స్కూల్‌ను, వరి కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేసిన జగిత్యాల కలెక్టర్.
@ వేములవాడ రాజన్న ఆలయంలో వైభవంగా మహాలింగార్చన.
@ ధర్మపురి గోదావరిలో పుణ్యస్నానాలకు పోటెత్తిన భక్తులు.
@ మెట్ పల్లి పట్టణంలో ఇద్దరు నకిలీ విలేకరుల అరెస్ట్.
@ కొత్తపల్లి పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన పోలీస్ కమిషనర్.
@ వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ.
Similar News
News December 4, 2024
పెద్దపల్లి: గ్రూప్-4 నియామక పత్రాలు అందజేసిన సీఎం
గ్రూప్-4 ఉద్యోగాలు పొందిన అభ్యర్థులకు సీఎం రేవంత్ రెడ్డి నియామక పత్రాలు అందజేశారు. పెద్దపల్లిలో నిర్వహించిన యువ వికాసం కార్యక్రమంలో భాగంగా నియామక పత్రాలను అందజేసి వారిని అభినందించారు. రాష్ట్ర వ్యాప్తంగా 8,084 మందికి నియామక పత్రాలు అందజేశామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. రానున్న రోజుల్లో మరిన్ని ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు.
News December 4, 2024
డిమాండ్‌కు తగ్గట్టుగా బొగ్గు ఉత్పత్తి చేయాలి: సింగరేణి C&MD
పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌ను దృష్ట్యా సింగరేణితో ఒప్పందం ఉన్న థర్మల్ విద్యుత్ కేంద్రాలకు సరిపడా బొగ్గును సరఫరా చేసేందుకు వీలుగా రోజుకు 2.5 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి, రవాణా చేయాలని సింగరేణి సంస్థ C&MD బలరాం ఆదేశించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో మిగిలి ఉన్న 120 రోజుల్లో ఉత్పత్తి లక్ష్య సాధనకు సమష్టిగా కృషి చేయాలన్నారు. అన్ని ఏరియాల GMలతో ఉత్పత్తిపై ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు.
News December 4, 2024
పెద్దపల్లిలో సీఎం షెడ్యూల్ ఇదే
* గ్రూప్4 ఉద్యోగాలకు నియామకపత్రాలు అందజేత
* సింగరేణిలో వివిధ ఉద్యోగాలకు ఎంపికైన 593 మందికి నియామకపత్రాలు అందజేత
* 442 మంది సివిల్ అసిస్టెంట్ సర్జన్లకు నియామకపత్రాలు అందజేత
* స్కిల్ వర్శిటీలో భాగమయ్యే సంస్థలతో ఒప్పందాలపై సంతకాలు
* డిజిటల్ ఎంప్లాయిమెంట్ ఎక్స్‌ఛేంజ్, సీఎం కప్ ప్రారంభం
* బస్ డిపో, పెద్దపల్లి-సుల్తానాబాద్ బైపాస్ రహదారి నిర్మాణానికి శంకుస్థాపన
* కొత్తగా మంజూరైన పోలీస్ స్టేషన్లు ప్రారంభం