News December 1, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ రేపటినుండి ప్రజాపాలన విజయోత్సవాలు. @ తంగళ్ళపల్లి మండలంలో రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి. @ వేములవాడ రాజన్న, కొండగట్టు అంజన్న ఆలయాలలో భక్తుల రద్దీ. @ జగిత్యాల జిల్లాకు 50 మంది కానిస్టేబుల్ల కేటాయింపు. @ మెట్పల్లి పట్టణంలో మైనారిటీ గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన ఆర్డిఓ. @ సిరిసిల్ల జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్.

Similar News

News January 20, 2026

కరీంనగర్‌లో పలువురు ఇన్‌స్పెక్టర్ల బదిలీ

image

మల్టీ జోన్-1 పరిధిలో పరిపాలనా కారణాలతో పలువురు ఇన్‌స్పెక్టర్లను బదిలీ చేస్తూ ఐజీ ఉత్తర్వులు జారీ చేశారు. కరీంనగర్ సీసీఆర్‌బీ ఇన్‌స్పెక్టర్ గుర్రం తిరుమల్‌ను టౌన్-III ఎస్‌హెచ్‌ఓగా, వీఆర్‌లో ఉన్న వి.పుల్లయ్యను మహిళా పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓగా నియమించారు. అలాగే డబ్ల్యూపీఎస్ ఇన్‌స్పెక్టర్ ఎండీ రఫీక్ ఖాన్‌ను వీఆర్‌కు, ట్రాఫిక్-II ఇన్‌స్పెక్టర్ పార్స రమేష్‌ను మందమర్రి కి బదిలీ చేశారు.

News January 20, 2026

KNR: ఎన్నికల విధులకు 12 మంది నోడల్ అధికారులు

image

కరీంనగర్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం సమాయత్తమవుతోంది. ఎన్నికల ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించేందుకు కలెక్టర్ పమేలా సత్పతి 12 మంది నోడల్ అధికారులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కరీంనగర్ కార్పొరేషన్‌తో పాటు హుజూరాబాద్, జమ్మికుంట, చొప్పదండి మున్సిపాలిటీల్లో ఎన్నికల శిక్షణ, బ్యాలెట్ పేపర్ల ముద్రణ, మీడియా పర్యవేక్షణ వంటి కీలక బాధ్యతలను వీరికి అప్పగించారు.

News January 20, 2026

KNR: మున్సిపల్ ఎన్నికలు.. రంగంలోకి మంత్రి తుమ్మల!

image

కరీంనగర్ జిల్లాలో ఒక కార్పొరేషన్ 3 మున్సిపాలిటీలు ఉన్నాయి. కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో 66 డివిజన్లు ఏర్పాటు చేశారు. కార్పొరేటర్ కోసం కాంగ్రెస్ నుంచి ఎక్కువ మంది అభ్యర్థులు మక్కువ చూపుతున్నారు. పలువురు టికెట్ల కోసం.. మంత్రులు, వివిధ హోదాలో ఉన్న వారి ఇళ్ల చుట్టూ తిరుగుతున్నారు. కాంగ్రెస్ పార్టీ దీనికి చెక్కు పెడుతూ కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల ఇంఛార్జ్‌గా మంత్రి తుమ్మల నాగేశ్వరరావును నియమించింది.