News December 24, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి క్రైమ్ న్యూస్

image

@ గంగాధర పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన కరీంనగర్ పోలీస్ కమిషనర్@ ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉరివేసుకొని వ్యక్తి ఆత్మహత్య@ కమలాపూర్ మండలంలో రోడ్డు ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలు@ ముస్తాబాద్ మండలంలో ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య@ వీణవంక మండలంలో ప్రమాదవశాత్తు మంటలలో చిక్కుకొని వ్యక్తి మృతి

Similar News

News January 24, 2025

స్మార్ట్ సిటీ ద్వారా KNR అభివృద్ధి అయ్యిందంటే.. అది బండి సంజయ్ వల్లే: మేయర్

image

స్మార్ట్ సిటీ పై కరీంనగర్ మేయర్ యాదగిరి సునీల్ రావు(బీఆర్ఎస్) సంచలన వ్యాఖ్యలు చేశారు. బండి సంజయ్ వల్లే కరీంనగర్‌కు రూ.428 కోట్ల స్మార్ట్ సిటీ నిధులు మంజూరయ్యాయని అన్నారు. 2017లోనే కరీంనగర్ ను ‘స్మార్ట్ సిటీ’గా ఎంపిక చేసినా నిధులు రాలేదు అని తెలిపారు. స్మార్ట్ సిటీ ద్వారా కరీంనగర్ అభివృద్ధి అయ్యిందంటే అది బండి సంజయ్ వల్లే అని అన్నారు.

News January 24, 2025

నేడు కరీంనగర్‌కు రానున్న కేంద్రమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్

image

కేంద్రమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ KNR లో పర్యటించనున్నారు. కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, మేయర్ తో కలిసి మల్టీపర్పస్ స్కూల్లో చేపట్టిన పార్కు పనులు, స్పోర్ట్స్ కాంప్లెక్స్ తో పాటు అనుబంధ పనులు, హౌసింగ్ బోర్డ్ కాలనీ 24/7 తాగునీటి సరఫరా, కుమ్మర్ వాడి హై స్కూల్ లో డిజిటల్ క్లాస్ రూమ్ ను ప్రారంభిస్తారు. బహిరంగ సభలో పాల్గొంటారు. డంపింగ్ యార్డ్‌ని సందర్శిస్తారు.

News January 23, 2025

UGCముసాయిదా పై చర్చించిన మాజీ ఎంపీ

image

విశ్వ విద్యాలయాల్లో నియామకాలకు సంబంధించి UGC ప్రతిపాదించిన కొత్త నిబంధనలపై చర్చించేందుకు తెలంగాణ భవన్ లో BRS నేతల సమావేశం గురువారం నిర్వహించారు. ఈ సమావేశంలో కరీంనగర్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్, బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ లు పాల్గొన్నారు. UGC ముసాయిదా అమల్లోకి వస్తే యూనివర్సిటీలు కేంద్రం గుప్పెట్లోకి వెళ్లే అవకాశం ఉందని నేతలు పేర్కొన్నారు.