News December 24, 2024
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో క్రైమ్ న్యూస్

☞JGTL: డ్రైనేజీలో పడేసి బండరాళ్లతో యువకుడు పై దాడి ☞JMKT: గుంపుల క్రాస్ వద్ద రోడ్డు ప్రమాదం.. డ్రైవర్ కు తీవ్ర గాయాలు☞మల్లాపూర్: బాలుడిపై అత్యాచారం చేసిన నిందితుడికి 20 సంవత్సరాల శిక్ష☞కమలాపూర్: రోడ్డు ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలు ☞మద్దికుంటలో ఉరివేసుకొని వ్యక్తి ఆత్మహత్య ☞వీణవంక: చల్లూరు లో ప్రమాదవశాత్తు మంటల్లో చిక్కుకొని వ్యక్తి మృతి☞మంథనిలో ప్రమాదవశాత్తు ట్రాక్టర్ బోల్తా
Similar News
News October 15, 2025
KNR: బ్రెస్ట్ క్యాన్సర్పై అవగాహన సదస్సు

స్థానిక ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో కరీంనగర్ హెల్త్ క్లబ్, రెడ్డీస్ లాబరేటరీ ఆధ్వర్యంలో, ప్రిన్సిపల్ డా.డి.వరలక్ష్మి అధ్యక్షతన, డాక్టర్ ఎం. ప్రతిష్ఠ రావు Reproduction concern Grenz, మహిళలలో వచ్చే Breast Cancer, PCDD పై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో హెల్త్ క్లబ్ కో ఆర్డినేటర్ డా. నజియా, జె.రజిత, డి.స్వరూప రాణి, అధ్యాపక సిబ్బంది, విద్యార్థినులు పాల్గొన్నారు.
News October 15, 2025
జమ్మికుంట: నిలకడగానే పత్తి గరిష్ట ధర

జమ్మికుంట వ్యవసాయ మార్కెట్లో పత్తి గరిష్ట ధర నిన్నటి లాగానే నిలకడగానే ఉంది. మంగళవారం యార్డుకు 951 క్వింటాళ్ల విడిపత్తిని రైతులు తీసుకొని రాగా.. గరిష్టంగా క్వింటాకు రూ.6,400, కనిష్టంగా రూ.5,000 ధర పలికింది. గోనెసంచుల్లో 38 క్వింటాళ్లు తీసుకొని రాగా గరిష్టంగా రూ. 6,000 ధర లభించింది. మార్కెట్ కార్యకలాపాలను మార్కెట్ చైర్ పర్సన్ పుల్లూరి స్వప్న, ఉన్నత శ్రేణి కార్యదర్శి మల్లేశం పరిశీలించారు.
News October 14, 2025
కరీంనగర్: ‘ఆరోగ్య మహిళ’ సేవలు వినియోగించుకోవాలి: కలెక్టర్

కరీంనగర్ జిల్లా సప్తగిరి కాలనీ ఆరోగ్య కేంద్రంలో ‘ఆరోగ్య మహిళ’ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మహిళలు ఉచిత వైద్య పరీక్షలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలన్నారు. ప్రతిమ ఫౌండేషన్ మొబైల్ వాహనంలో 2డీ ఎకో, ఎక్స్రే, మమ్మోగ్రఫీ పరీక్షలను కలెక్టర్ పరిశీలించారు.