News January 16, 2025

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ ముస్తాబాద్ మండలంలో అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి. @ వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల కోలాహలం. @ ఇబ్రహీంపట్నం మండలంలో అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి. @ వేములవాడలో ఆర్ఎంపి క్లినిక్ సీజ్. @ బోయిన్పల్లి మండలంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను తనిఖీ చేసిన జిల్లా వైద్యాధికారి. @ మెట్పల్లి మండలంలో ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం.

Similar News

News February 9, 2025

కరీంనగర్: వ్యక్తిని ఢీకొన్న బైక్.. స్పాట్‌లో మృతి

image

జిల్లాలోని రామడుగు మండలం వెదిర గ్రామంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కొలిపూరీ మైసయ్య అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. కాగా, మృతుడు బస్ స్టాండ్ నుంచి ఇంటికి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా వేగంగా వచ్చిన బైక్ అతడిని ఢీ కొట్టిందని, దీంతో అతడి తలకు తీవ్ర గాయమైందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

News February 9, 2025

కరీంనగర్: కడుపునొప్పి భరించలేక వృద్ధుడు ఆత్మహత్య

image

కడుపునొప్పి భరించలేక సైదాపూర్ మండలంలోని వెన్కేపల్లి గ్రామానికి చెందిన అమరగొండ వీరయ్య (75) అనే వృద్ధుడు ఆదివారం తెల్లవారుజామున చేదబావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడని ఎస్ఐ సీహెచ్. తిరుపతి తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. కాగా, మృతుడికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారన్నారు.

News February 9, 2025

కరీంనగర్ జిల్లాలో మొదలైన ఎన్నికల సందడి

image

కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పంచాయతీ ఎన్నికల సందడి నెలకొంది. త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలను నిర్వహించేందుకు కసరత్తు చేస్తుండటంతో గ్రామాల్లో ఆశావహులు తమదైన రీతిలో ప్రచారం మొదలు పెట్టారు. పలు చోట్ల మాజీ సర్పంచులతో పాటు.. యువకులు, ఇతరులు ఎన్నికల్లో నెగ్గేందుకు మంతనాలు ప్రారంభించారు. అంతేకాదు, ఈ ఎన్నికల్లో తమకు అవకాశం ఇవ్వాలని పలువురు ప్రధాన నేతలను కలుస్తున్నారు.

error: Content is protected !!