News February 17, 2025
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే అధికం

ఉమ్మడి KNR, MDK, ADB, NZB జిల్లాల పట్టభద్రుల ఎన్నికల్లో ఉమ్మడి కరీంనగర్‌లోనే దాదాపు 45 శాతానికి పైగా ఓట్లు ఉన్నాయి. దీంతో అన్ని రాజకీయ పార్టీలు, అభ్యర్థులందరూ KNR కేంద్రంగానే ప్రచారంపై దృష్టి పెడుతున్నారు. అన్ని పార్టీల అధినేతలు KNR కేంద్రంగానే తమ ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు. దాదాపు 3 లక్షల 50వేల పైచిలుకు ఓట్లలో సగం ఉమ్మడి KNR జిల్లాలోనే ఉన్నాయి.
Similar News
News April 16, 2026
నిర్మల్: పాలీసెట్ పరీక్షకు దరఖాస్తుల ఆహ్వానం

మే 13వ తేదీన నిర్వహించనున్న పాలీసెట్ ప్రవేశ పరీక్షకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు నిర్మల్ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ రమేష్ తెలిపారు. పదో తరగతి పరీక్ష రాసిన, ఉత్తీర్ణులైన అభ్యర్థులు డిప్లమో కోర్సుకు ఈ నెల 20 లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ప్రవేశ పరీక్షలో వచ్చిన ర్యాంకుల ఆధారంగా ప్రవేశం కల్పిస్తామన్నారు. పాలిటెక్నిక్ కళాశాలలో విద్యార్థుల సహాయార్థం హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
News April 16, 2026
కరోండా(వాక్కాయ)ను ఎలా, ఎప్పుడు నాటాలి?

వర్షాకాలంలో కరోండా(వాక్కాయ)ను నాటితే బాగా పెరుగుతుంది. పొలానికి చుట్టూ ప్రతి 1 మీటరు దూరంలో ఒక మొక్క నాటాలి. మొదటి రెండేళ్లలో మొక్కలకు నీరు పోయడం, ఎరువులు వేయడం అవసరం. మూడో ఏడాది నుంచే ఇది సహజమైన జీవకంచెగా మారిపోతుంది. ఎప్పటికప్పుడు పొదలను కొంచెం కత్తిరించి సమానంగా పెంచితే కంచె మరింత బలంగా మారి పంటకు రక్షణగా నిలుస్తుంది. అలాగే ఈ వాక్కాయ పండ్లను అమ్మి రైతులు అదనపు ఆదాయాన్ని పొందవచ్చు.
News April 16, 2026
‘వ్యవసాయ భూములను నివాస ప్రాంతాల నుంచి తొలగించాలి’

వ్యవసాయ భూములను నివాస ప్రాంతాల నుంచి తొలగించాలని కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. జిల్లా స్థాయి అనామిలి కమిటీ సమావేశం గురువారం బాపట్ల కలెక్టరేట్‌లో నిర్వహించారు. నివాస ప్రాంతాల ధరల మాదిరిగానే వ్యవసాయ భూములకు ధరలను నిర్ణయించడంపై వచ్చిన అర్జీలను కలెక్టర్ పరిశీలించారు. రైతులకు మేలు చేయడం లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. మార్కెట్ వాల్యూ జిల్లా రిజిస్టర్ కమిటీ కన్వీనర్ ప్రసాద్ పాల్గొన్నారు.


