News February 17, 2025

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే అధికం

image

ఉమ్మడి KNR, MDK, ADB, NZB జిల్లాల పట్టభద్రుల ఎన్నికల్లో ఉమ్మడి కరీంనగర్‌లోనే దాదాపు 45 శాతానికి పైగా ఓట్లు ఉన్నాయి. దీంతో అన్ని రాజకీయ పార్టీలు, అభ్యర్థులందరూ KNR కేంద్రంగానే ప్రచారంపై దృష్టి పెడుతున్నారు. అన్ని పార్టీల అధినేతలు KNR కేంద్రంగానే తమ ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు. దాదపు 3 లక్షల 50వేల పైచిలుకు ఓట్లలో సగం ఉమ్మడి KNR జిల్లాలోనే ఉన్నాయి.

Similar News

News April 24, 2025

KNR: నేటి నుంచి బాలభవన్ లో వేసవి శిక్షణ

image

కలెక్టర్, విద్యాశాఖ సహకారంతో బాలభవన్ ఆధ్వర్యంలో నేటి నుంచి వేసవి శిక్షణ తరగతులు ప్రారంభమవుతాయనిబాలభవన్ సూపరింటెండెంట్ కే.మంజుల దేవి ఒక ప్రకటనలో తెలిపారు. జూన్ 10 వరకు ప్రతీ రోజు ఉదయం 7 గం. నుంచి 12 గం. వరకు శిక్షణ తరగతులు ఉంటాయన్నారు. 5 నుంచి 16 సం. వయస్సు ఉన్న వారు అర్హులని చెప్పారు. ఆసక్తి గల వారు తమ ఆధార్, పాస్ పోర్ట్ సైజ్ ఫొటో తో అంబేడ్కర్ స్టేడియంలోని శిక్షణ శిబిరంలో నమోదు చేసుకోవాలన్నారు.

News April 24, 2025

కరీంనగర్: పాత వస్తువులకు వేలం: సీపీ

image

KNR పోలీస్ కమిషనరేట్‌లోని వివిధ విభాగాలకు చెందిన ఉపయోగింబడిన, పాత వస్తువులను వేలం వేయనున్నట్లు పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ వేలం పాట కరీంనగర్ – సిరిసిల్ల బైపాస్ రోడ్డులోని కరీంనగర్ సిటీ ట్రైనింగ్ సెంటర్‌లో ఈ నెల 28న ఉదయం 10 గంటలకు వేలం నిర్వహించనున్నట్లు అన్నారు. ఆసక్తి ఉన్నవారు ఈ వేలం పాటలో పాల్గొనవచ్చని సీపీ తెలిపారు.

News April 24, 2025

కరీంనగర్ జిల్లాలో అధిక ఉష్ణోగ్రతలు నమోదు

image

కరీంనగర్ జిల్లాలో గడిచిన 24 గంటల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో అత్యధికంగా తిమ్మాపూర్ మండలంలో 44.7°C నమోదు కాగా, మానకొండూర్ 44.6, జమ్మికుంట 44.5, రామడుగు 44.4, చొప్పదండి 44.2, కరీంనగర్ 44.1, చిగురుమామిడి, కరీంనగర్ రూరల్ 44.0, వీణవంక, గంగాధర 43.9, శంకరపట్నం 43.4, గన్నేరువరం 43.3, కొత్తపల్లి, ఇల్లందకుంట 43.1, హుజూరాబాద్ 42.4, సైదాపూర్ 41.9°C గా నమోదైంది.

error: Content is protected !!