News March 20, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ ఇబ్రహీంపట్నం మండలం గండి హనుమాన్ చెక్ పోస్ట్ వద్ద 2,53,000 నగదు సీజ్. @ కరీంనగర్ రూరల్ స్టేషన్ ఏఎస్సై కిషన్ గుండెపోటుతో మృతి. @ ఓదెల మండలంలో విద్యుత్ షాక్ తో రైతు మృతి. @ పెద్దపల్లి మండలంలో విద్యుత్ షాక్ తో యువకుడి మృతి. @ కమలాపూర్ మండలంలో రైలు నుండి పడి యువకుడికి గాయాలు. @ మల్యాల మండలంలో ఉరివేసుకొని యువకుడి ఆత్మహత్య.

Similar News

News November 14, 2025

కరీంనగర్: రేపు SPECIAL లోక్ అదాలత్

image

జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో రేపు ప్రత్యేక లోక్ అదాలత్‌ను నిర్వహిస్తున్నట్లు కరీంనగర్ అదనపు సీనియర్ సివిల్ జడ్జ్ కే.రాణి తెలిపారు. ఈ అదాలత్‌లో క్రిమినల్, సివిల్, చెక్ బౌన్స్, మోటార్ ప్రమాదాల పరిహారం వంటి కేసులు ఇరుపక్షాల రాజీతో పరిష్కారమవుతాయని చెప్పారు. రాజీపడదగిన వారు సంబంధిత పోలీసు వారిని సంప్రదించాలని ఆమె సూచించారు.

News November 13, 2025

కరీంనగర్: నవంబర్ 15న ప్రత్యేక లోక్ అదాలత్

image

జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 15న ప్రత్యేక లోక్ అదాలత్‌ను నిర్వహిస్తున్నట్లు కరీంనగర్ అదనపు సీనియర్ సివిల్ జడ్జ్ కె. రాణి తెలిపారు. ఈ అదాలత్‌లో క్రిమినల్, సివిల్, చెక్ బౌన్స్, మోటార్ ప్రమాద పరిహార వంటి కేసులు ఇరుపక్షాల రాజీతో పరిష్కరించబడతాయని చెప్పారు. రాజీపడదగిన వారు సంబంధిత పోలీసు వారిని సంప్రదించాలని ఆమె సూచించారు.

News November 13, 2025

శాతవాహన ఆర్ట్స్ కళాశాలలో యాంటీ ర్యాగింగ్‌పై అవగాహన

image

శాతవాహన విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాల సెమినార్ హాల్లో కళాశాల ప్రిన్సిపల్ సుజాత అధ్యక్షతన యాంటీ ర్యాగింగ్, మహిళా భద్రత మాదకద్రవ్య నియంత్రణపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులకు యాంటీ ర్యాగింగ్, మహిళా భద్రత మాదకద్రవ్య నియంత్రణపై రిజిస్ట్రార్ రవికుమార్ జాస్తి, కొత్తపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ కోటేశ్వర్, షీ టీమ్స్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీలత అవగాహన కల్పించారు.