News May 3, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ సైదాపూర్ మండలంలో బైక్ అదుపు తప్పి కిందపడి మహిళా మృతి. @ మెట్పల్లి పట్టణంలో 1,50,000 నగదు సీజ్. @ ఓదెల మండలంలో వడదెబ్బతో రైతు మృతి. @ రామగుండం రోడ్ షో లో కేసీఆర్. @ ధర్మపురి నియోజకవర్గంలో జన జాతర సభలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి. @ రాయికల్ పట్టణంలో 11 మందిపై పిచ్చికుక్క దాడి. @ వేములవాడ రూరల్ మండలంలో బొలెరో వాహనం ఢీకొని బాలుడు మృతి. @ పార్లమెంట్ ఎన్నికలకు పటిష్ట ఏర్పాట్లు: కరీంనగర్ కలెక్టర్

Similar News

News November 3, 2024

ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి వారి ఆదాయం

image

జగిత్యాల జిల్లాలో ప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి ఆదివారం రూ.3,62,638 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు టికెట్ల అమ్మకం ద్వారా రూ.2,13,973, ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.1,03,600, అన్నదానం రూ.45,065, వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ ప్రజలకు తెలియజేశారు.

News November 3, 2024

రాజన్నను దర్శించుకున్న 60,256 భక్తులు

image

దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామివారి కార్తీక మాసం ప్రారంభంలో 60,256 మంది భక్తులు దర్శించుకున్నారని ఆలయ ఈవో కే. వినోద్ రెడ్డి తెలిపారు. అధిక సంఖ్యలో భక్తులు రావడంతో ఆలయంతో పాటు పరిసర ప్రాంతాలు భక్తులతో కిటకిటలాడాయి. ధర్మ దర్శనంలో భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు పర్యవేక్షించారు.

News November 3, 2024

KNR: చేనేత ఐక్యవేదిక జిల్లా ప్రతినిధుల నియామకం

image

తెలంగాణ చేనేత ఐక్యవేదిక జిల్లా అధికార ప్రతినిధిగా పోరండ్ల ప్రవీణ్ (గోదావరిఖని) అలాగే జిల్లా సహాయ కార్యదర్శిగా బూర్ల శ్రీనివాస్ (లక్ష్మీపురం) ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు రాపోలు వీర మోహన్, జిల్లా అధ్యక్షుడు ఆడెపు శంకర్ నియామక ఉత్తర్వులను జారీ చేసినట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు ఎన్నికైన ప్రతినిధులను అభినందించారు.