News May 20, 2024
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి TOP NEWS
@ జగిత్యాల రూరల్ మండలంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్. @ సుల్తానాబాద్ మండలంలో విద్యుత్ షాక్ తగిలి 2 గేదెలు మృతి. @ కొడిమ్యాల మండలంలో కారు, బైకు డీ.. ఒకరికి తీవ్ర గాయాలు. @ చిగురు మామిడి మండలంలో హైనా దాడిలో దూడ మృతి. @ దళారులను నమ్మి నిరుద్యోగులు మోసపోవద్దన్న వేములవాడ డీఎస్పీ. @ ధర్మపురిలో వైభవంగా కొనసాగుతున్న లక్ష్మీనరసింహస్వామి నవరాత్రి ఉత్సవాలు.
Similar News
News December 8, 2024
సైలెంట్ కిల్లర్ కాదు.. నా శైలిలో ముందుకెళ్తున్నా: శ్రీధర్ బాబు
ఐటీ మంత్రిగా తనకు ఎవరితో పోలిక లేదని, తనదైన శైలిలో ముందుకెళ్తానని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. గత ప్రభుత్వ ఐటీ మంత్రి కంటే మెరుగ్గా పనిచేస్తారా? అని మీడియా ప్రతినిధి అడగ్గా ఆయన ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో ఎవరి ఆలోచనలు వారికి ఉంటాయని, తనదైన శైలిలో కృషి చేస్తానని అన్నారు. తమకున్న వనరులతోనే ముందుకు వెళుతున్నట్లు తెలిపారు. అలాగే తాను సైలెంట్ కిల్లర్ కాదని పనిలో నిమగ్నమవుతానని స్పష్టం చేశారు.
News December 8, 2024
వేములవాడ కోడెల విక్రయం అవాస్తవం: మంత్రి కొండా సురేఖ
వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో కోడెలను అక్రమంగా విక్రయించినట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదని అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. ప్రభుత్వంపై బురదజల్లే రీతిలో కుట్రపూరితంగా ప్రసారమవుతున్న తప్పుడు వార్తలను ఆమె ఖండించారు. ప్రభుత్వం హిందువుల మనోభావాలు దెబ్బతీస్తుందని అవాస్తవాలు ప్రచారం చేస్తూ సమాజంలో అశాంతిని సృష్టించే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు.
News December 8, 2024
సిరిసిల్ల: నిబంధనలు పాటిస్తూ హాజరు కావాలి: కలెక్టర్
గ్రూప్ 2 అభ్యర్థులు నిబంధనలు పాటిస్తూ పరీక్షలకు హాజరుకావాలని సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. సిరిసిల్ల పట్టణంలోని కలెక్టరేట్లో ఆదివారం ఆయన ప్రకటన విడుదల చేశారు. ఈనెల 9వ తేదీన అభ్యర్థులు హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలన్నారు. పరీక్ష కేంద్రాలకు సెల్‌ఫోన్ ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు తీసుకురావద్దని తెలిపారు. అభ్యర్థులు సకాలంలో పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని పేర్కొన్నారు.