News June 4, 2024
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

@ కరీంనగర్ ఎంపీగా బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ విజయం.
@ పెద్దపల్లి ఎంపీగా కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ విజయం.
@ నిజామాబాద్ ఎంపీగా బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ విజయం.
@ కరీంనగర్, పెద్దపల్లి జిల్లాలలో ప్రశాంతంగా ముగిసిన పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్.
@ ఎండపల్లి మండలంలో రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.
@ వీణవంక మండలంలో ఎల్లమ్మ ఆలయంలో చోరీ.
@ మల్హర్ మండలంలో తాటి చెట్టు పై పడిన పిడుగు.
Similar News
News February 22, 2026
రేపు యథావిధిగా ‘ప్రజావాణి’: జిల్లా కలెక్టర్

కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ ఆడిటోరియంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని యథావిధిగా నిర్వహించనున్నట్లు కలెక్టర్ పమేలా సత్పతి ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజల సమస్యల సత్వర పరిష్కారమే ధ్యేయంగా ఈ కార్యక్రమం కొనసాగుతుందని పేర్కొన్నారు. వివిధ సమస్యలపై అర్జీలు ఇచ్చేందుకు వచ్చే ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. ఉదయం నిర్ణీత సమయానికి అధికారులు హాజరై ఫిర్యాదులను స్వీకరిస్తారని పేర్కొన్నారు.
News February 22, 2026
భూసేకరణ వేగవంతం చేయండి: కలెక్టర్

కరీంనగర్ జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల భూసేకరణ ప్రక్రియను యుద్ధప్రతిపాదికన పూర్తి చేయాలని కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. శనివారం అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడుతూ.. వరద కాలువ, మిడ్ మానేరు, గౌరవెల్లి వంటి ప్రాజెక్టుల పనుల్లో ఎక్కడా జాప్యం జరగకుండా చూడాలన్నారు. ప్రభుత్వ ప్రాధాన్యతను గుర్తించి, రైతుల ప్రయోజనాల దృష్ట్యా భూసేకరణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు.