News June 7, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలన్న ఉమ్మడి కరీంనగర్ జిల్లా కలెక్టర్లు.
@జగిత్యాల రూరల్ మండలంలో ఇంటిపై విరిగిపడ్డ తాటిచెట్టు.
@ఎల్లారెడ్డిపేట మండలంలో ఎస్సైపై తప్పుడు పోస్ట్ చేసిన వ్యక్తిపై కేసు.
@కరీంనగర్‌లో చేప మందు పంపిణీ.
@కథలాపూర్ మండలంలో 12 మంది పేకాటరాయుళ్ల పట్టివేత.
@తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ఇంచార్జ్‌ను కలిసిన పెద్దపల్లి ఎంపీ.

Similar News

News December 7, 2024

రేవంత్ రెడ్డి ఏడాది పాలన.. కరీంనగర్ REPORT

image

రేవంత్ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి నేటికి సరిగ్గా ఏడాది. కాగా, ఈ ఏడాదిలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పెద్దపల్లి జిల్లాకు రూ.1,000 కోట్లు, చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు పనులు పున:ప్రారంభం, ఉమ్మడి జిల్లా రోడ్ల విస్తరణకు రూ.100 కోట్లు, వేములవాడ ఆలయానికి రూ.127 కోట్లు ఇంకా మరెన్నో నిధులు తెచ్చామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. వచ్చే 4 ఏళ్లలో మరింత అభివృద్ధి చేస్తామని అంటున్నారు. దీనిపై మీ కామెంట్?

News December 7, 2024

పరిశ్రమలను ప్రోత్సహిస్తున్నాం: మంత్రి శ్రీధర్ బాబు

image

రాష్ట్రంలో లక్షలాది మందికి ఉపాధిని కల్పిస్తున్న సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఇటీవల కొత్త విధానాన్ని ప్రవేశపెట్టిందని ఐటీ మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. ఈ మేరకు డెయిరీ బ్రాండ్ ‘డైరీ ట్రెండ్స్’ లోగోను ఆవిష్కరించి మాట్లాడారు. MSMEలను స్థాపించడానికి తెలంగాణ అద్భుతమైన వ్యాపార వాతావరణాన్ని కల్పిస్తోందని, పారిశ్రామికవేత్తలు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.

News December 6, 2024

రాజన్నను దర్శించుకున్న 26,928 మంది భక్తులు 

image

దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి వారి ఆలయాన్ని శుక్రవారం 26,928 మంది భక్తులు దర్శించుకున్నట్లు ఈవో వినోద్ రెడ్డి తెలిపారు. అధిక సంఖ్యలో భక్తులు రావడంతో ఆలయంతో పాటు పరిసర ప్రాంతాలు భక్తులతో కిటకిటలాడాయి. ధర్మ దర్శనంలో భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు పర్యవేక్షించారు. కోడె మొక్కలు చెల్లించుకొని భక్తి శ్రద్ధలతో తీర్థప్రసాదాలు స్వీకరించారు.