News June 21, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం. @ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి. @ ఎలిగేడు మండలంలో పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడులు. @ ధర్మపురి మండలంలో వ్యవసాయ బావిలో పడి యువకుడి మృతి. @ కోనరావుపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన సిరిసిల్ల కలెక్టర్. @ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు తీసుకుంటామన్న జగిత్యాల ఎస్పీ.

Similar News

News November 7, 2025

కరీంనగర్: రాష్ట్ర స్థాయి పురస్కారాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

కరీంనగర్ జిల్లాలో దివ్యాంగుల సంక్షేమం కోసం కృషి చేసిన వ్యక్తుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. డిసెంబర్ 3న రాష్ట్ర స్థాయిలో జరిగే అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా పురస్కారాలను అందుకునేందుకు అర్హులైన దివ్యాంగుల వ్యక్తులు/సంస్థల నుంచి దరఖాస్తులు కోరుతున్నామని జిల్లా సంక్షేమ అధికారిణి సరస్వతీ తెలిపారు. ఎంపికైన వారికి HYDలో అవార్డు ఇవ్వనున్నారు. ఆసక్తి గల వారు ఈనెల 15లోగా అప్లై చేసుకోలన్నారు.

News November 6, 2025

కరీంనగర్: TNGO జిల్లా కార్యవర్గ సమావేశం

image

టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు దారం శ్రీనివాస్ ఆధ్వర్యంలో టీఎన్జీవో జిల్లా కార్యాలయంలో ఈరోజు జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ ఉద్యోగుల ఆవేదన, పెన్షన్ సమస్య, రిటైర్‌మెంట్ బెనిఫిట్స్ ఆలస్యం, ఉద్యోగులపై జరుగుతున్న దాడులు, 317 జీవో ప్రభావం వంటి అనేక కీలక అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో కార్యదర్శి సంగేం లక్ష్మణరావు, జిల్లా అసోసియేట్ అధ్యక్షుడు ఓంటేల రవీందర్ రెడ్డి తదితరులు ఉన్నారు.

News November 6, 2025

మానకొండూర్: జ్యోతి వెలిగించి స్పోర్ట్స్ మీట్ ప్రారంభించిన కలెక్టర్

image

మానకొండూరు మండలం దేవంపల్లిలోని తెలంగాణ రాష్ట్ర సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్‌లో 11వ జోనల్ స్థాయి స్పోర్ట్స్ మీట్ 2025 అట్టహాసంగా ప్రారంభమైంది. కలెక్టర్ పమేలా సత్పతి జ్యోతి వెలిగించి ఈ స్పోర్ట్స్ మీట్‌‌ను ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. విద్యార్థుల ప్రతిభ పాఠవాలను వెలికి తీసేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదం చేస్తాయన్నారు. విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలన్నారు.