News June 27, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ జగిత్యాల ఆర్డిఓ ఆఫీసును తనిఖీ చేసిన కలెక్టర్.
@ మెట్పల్లి మండలంలో తాటి చెట్టు పైనుండి పడి గీత కార్మికుడి మృతి.
@ వేములవాడ రాజన్న ఆలయానికి భక్తుడి రూ.35 లక్షల విరాళం.
@ బోయిన్పల్లి మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన సిరిసిల్ల కలెక్టర్.
@ కమలాపూర్ మండలంలో స్కూల్ వ్యాన్, కారు ఢీ.. ముగ్గురికి తీవ్ర గాయాలు.
@ కరీంనగర్‌లో గుండెపోటుతో హెడ్ కానిస్టేబుల్ మృతి.

Similar News

News October 8, 2024

డబుల్ డోస్‌తో నాని మూవీ: శ్రీకాంత్ ఓదెల

image

డబుల్ డోస్‌తో నాని మూవీ ఉంటుందని డైరెక్టర్ ఓదెల శ్రీకాంత్ పేర్కొన్నారు. మంగళవారం చీకురాయిలో మాజీ జడ్పీటీసీ బండారు రామ్మూర్తి డైరెక్టర్ శ్రీకాంత్‌ను శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ.. తన తదుపరి చిత్రంతో నానితో ఉంటుందన్నారు. దసరాను మించిన యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా చిత్రం ఉండనుందని ఆయన తెలిపారు.

News October 8, 2024

జగిత్యాల: ఉపాధి కల్పనకు కసరత్తు

image

ఉపాధిహామీ పథకం కింద గ్రామీణ కూలీలకు చేతినిండా పని కల్పించడానికి జిల్లా అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా ఆయా గ్రామాల్లో చేపట్టాల్సిన పనులను గుర్తించారు. వచ్చే నెలలో మండలాల వారిగా ప్రణాళికలు ఖరారు చేయనున్నారు. కాగా జిల్లా వ్యాప్తంగా 1.67 లక్షల జాబ్ కార్డుల పరిధిలో 2.73 లక్షల మంది కూలీలు ఉన్నారు.

News October 8, 2024

సిరిసిల్ల: పత్తి కొనుగోలు కేంద్రాలకు మౌలిక వసతుల కల్పన

image

ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్‌లో వచ్చే పత్తి పంటను మద్దతు ధరపై కొనుగోలు చేసేందుకు ప్రణాళిక బద్ధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ అన్నారు. మంగళవారం జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ కలెక్టరేట్‌లో పత్తి కొనుగోలుపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్‌లో పత్తి కొనుగోలు యాక్షన్ ప్లాన్‌ను అధికారులు జిల్లా కలెక్టర్‌కు వివరించారు.