News November 20, 2024
ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పెరిగిన చలి

ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా చలి తీవ్రత పెరుగుతోంది. ముఖ్యంగా రాత్రిపూట ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయికి చేరుతున్నాయి. పగటిపూట సాధారణ స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వాతావరణ నిపుణులు తెలుపుతున్నారు. రానున్న రోజుల్లో చలి తీవ్రత మరింత ఎక్కువ అవుతాయని నిపుణులు సూచించారు. చలి తీవ్రత పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
Similar News
News October 25, 2025
KNR: ‘ఈనెల 30లోగా పరీక్ష ఫీజు తప్పనిసరిగా చెల్లించాలి’

పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు OCT 30 లోగా పరీక్ష ఫీజు తప్పనిసరిగా చెల్లించాలని జిల్లా విద్యాశాఖ అధికారి ఒక ప్రకటనలో తెలిపారు. రెగ్యులర్గా ఫెయిల్ అయిన విద్యార్థులు కూడా ఈ గడువు లోపు తమ ఫీజు చెల్లించాల్సిందిగా సూచించారు. రూ.50 ఆలస్య రుసుముతో NOV 15 వరకు, రూ. 300 ఆలస్య రుసుముతో DEC 2 వరకు, రూ. 500 ఆలస్య రుసుముతో DEC 15 వరకు పరీక్ష ఫీజు చెల్లించవచ్చని అన్నారు.
News October 25, 2025
JMKT: మార్కెట్కు రెండు రోజులు సెలవు

JMKT మార్కెట్కు శనివారం వారాంతపు సెలవు, ఆదివారం సాధారణ సెలవు ఉంటుందని మార్కెట్ కార్యదర్శి మల్లేశం తెలిపారు. శుక్రవారం మార్కెట్కు రైతులు 1,200 క్వింటాళ్ల విడి పత్తి విక్రయానికి తీసుకురాగా గరిష్ఠంగా రూ.7,200, కనిష్ఠంగా రూ.6,100 పలికింది. గోనె సంచుల్లో 27 క్వింటాళ్లు రాగా గరిష్ఠంగా రూ.6,600 పలికింది. CCI ద్వారా అమ్మిన 26.40 క్వింటాళ్ల పత్తికి గరిష్ఠంగా రూ.7866.70, కనిష్ఠంగా రూ.7785.60 ధర లభించింది.
News October 24, 2025
జిల్లా జైలను సందర్శించిన సీనియర్ సివిల్ జడ్జ్

జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాలకు అనుగుణంగా కరీంనగర్ జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి కె.వెంకటేష్ జిల్లా కారాగారాన్ని సందర్శించి, ఖైదీలకు అందుతున్న సేవలను తనిఖీ చేశారు. విచారణ ఖైదీలు జిల్లా కారాగారాన్ని ఒక పరివర్తన కేంద్రంగా భావించాలని, కారాగారంలో గడిపిన కాలంలో సత్ప్రవర్తనతో మెలిగి బయటకు వెళ్లిన తర్వాత క్షణికావేశాలకు లోనుకాకుండా ఉండాలని తెలియజేశారు.


