News March 20, 2025

ఉమ్మడి కరీంనగర్: బ్యాక్‌లాగ్ సీట్ల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

image

రాష్ట్రంలోని బీసీ గురుకుల పాఠశాలల్లో 2025-2026 ఏడాదికి 6,7,8,9 తరగతుల్లో బ్యాక్‌లాగ్ సీట్ల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. http://www.mjptbcadmissions.org లో ఈనెల 31లోగా దరఖాస్తు చేసుకోవాలని బీసీ గురుకుల సొసైటీ కార్యదర్శి బి. సైదులు తెలిపారు. ఎప్రిల్ 24న ప్రవేశ పరీక్ష ఉంటుందన్నారు. మొత్తం 6,832 సీట్లు ఖాళీగా ఉన్నాయని, ప్రవేశ పరీక్షలో మెరిట్ ఆధారంగా సీట్లు భర్తీ చేస్తామన్నారు.

Similar News

News March 22, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News March 22, 2025

చిట్యాల మండల వాసులైన ఇద్దరికి ప్రభుత్వ కొలువులు

image

తెలంగాణ ప్రభుత్వ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసిన కొలువుల ఫలితాల్లో చిట్యాల మండల వాసులైన ఇద్దరిని ప్రభుత్వ ఉద్యోగాలు వరించాయి. జూకల్‌కు చెందిన దొంతు మాధవరెడ్డి టౌన్ ప్లానింగ్ ఆఫీసర్‌గా, ముచినిపర్తి గ్రామానికి చెందిన గుండెపురెడ్డి శ్రీనివాస్ రెడ్డి పిఆర్ శాఖలో జూనియర్ టెక్నికల్ ఆఫీసర్‌గా సెలెక్ట్ కాగా.. శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఆర్డర్ కాపీలను తీసుకున్నట్లు వారు చెప్పారు.

News March 22, 2025

ఆకుల సేకరణకు వెళ్లి.. అనంత లోకాలకు..!

image

ఎటపాక మండలం చింతలపాడు గ్రామానికి చెందిన మడివి జ్యోతిలక్ష్మి(12) తునికి చెట్టు ఎక్కి ఆకుల సేకరణ చేస్తూ.. కింద పడి ఈనెల 17న గాయపడ్డారు. ఆమెను స్థానికులు లక్ష్మీపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స అందజేశారు. పరిస్థితి విషమించడంతో ఖమ్మంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చగా చికిత్స పొందుతూ శుక్రవారం మరణించారు.

error: Content is protected !!